కొబ్బరికాయల్లోకి నీళ్లు ఎలా వస్తాయో తెలుసా? ఇదో వింతైన రహస్యమే

samatha

27 November 2026

Pic credit - Pinterest

కొబ్బరి బోండా తెలియని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరూ ఎక్కువగా వేసవి కాలంలో కొబ్బరి బోండా తాగుతుంటారు. ఈ నీరు ఆరోగ్యానికి చాలా మంచిది.

కొబ్బరి బోండం

లేతగా ఉన్నప్పుడు కొబ్బరి బోండం నీళ్లు తాగడం వలన అందులో ఉండే పోషకాలు అనేక రకాల సమస్యల నుంచి కాపాడి, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

ఆరోగ్య ప్రయోజనాలు

ఇక ఇది కాస్త ముదిరి కాయగా మారిన తర్వాత కొబ్బరికాయను ఎక్కువగా దేవుడి పూజల్లో ఉపయోగిస్తుంటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొబ్బరి బోండాలోకి నీరు ఎలా వస్తాయో?

పూజ

కాగా, ఇప్పుడు మనం అసలు కొబ్బరి బోండాం లోనికి నీరు ఎలా వస్తాయి? దీని వెనకున్న అసలైన రహస్యం ఏంటో వివరంగా తెలుసుకుందాం పదండి.

నీరు ఎలా వస్తాయి

చిన్న కొబ్బరి బొండంలో నీరు ఎలా నిండుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ అద్భుతమైన ప్రక్రియ వెనుక ఆసక్తికరమైన సైన్స్ దాగి ఉంది. భూమిలోని నీటిని కొబ్బరి చెట్టు వేర్ల ద్వారా పీల్చుకుంటుంది.

అద్భుతమైన ప్రక్రియ

ఆ తర్వాత, ఈ నీరు కాండం గుండా పైకి ప్రయాణించి, ఆకుల సహాయంతో కాయలోనికి చేరుతుంది. అయితే, ఇది సాధారణ నీరు కాదు, పెరుగుతున్న కొబ్బరి విత్తనానికి అవసరమైన సహజ ద్రవ నిల్వ, దీనిని ద్రవ ఎండోస్పెర్మ్ అంటారు

నీరు ప్రయాణం

కొబ్బరి పువ్వు పరాగసంపర్కం తర్వాత చిన్న కాయగా మారుతుంది. రోజులు గడిచేకొద్దీ అది పెరుగుతూ, లోపల ఈ ద్రవ ఎండోస్పెర్మ్ పేరుకుపోతుంది. కాయ పచ్చిగా ఉన్నప్పుడు ఎక్కువ నీరు, తక్కువ గుజ్జు ఉంటుంది.

పరాగ సంపర్కం

 అదే కాయ ముదిరే కొద్దీ, ద్రవంలో కొంత భాగం తెల్లటి కొబ్బరి గుజ్జుగా మారుతుంది, అందుకే ముదిరిన కొబ్బరిలో గుజ్జు ఎక్కువగా కనిపిస్తుంది.

కాయగా మారడం