AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుటుంబ కలహాలు.. గొడ్డలితో దాడి! కొడుకు అరాచకంపై తండ్రి సంచలన నిర్ణయం!

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య, పిల్లలు ఉండగానే రెండో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి.. ఆ తర్వాత మొదటి భార్యతో గొడవలకు దిగి, చివరకు ఆమెను గొడ్డలితో హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడగా, నిందితుడిపై స్వయంగా అతడి తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

కుటుంబ కలహాలు.. గొడ్డలితో దాడి! కొడుకు అరాచకంపై తండ్రి సంచలన నిర్ణయం!
Axe
Balaraju Goud
|

Updated on: Nov 28, 2026 | 10:51 PM

Share

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య, పిల్లలు ఉండగానే రెండో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి.. ఆ తర్వాత మొదటి భార్యతో గొడవలకు దిగి, చివరకు ఆమెను గొడ్డలితో హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడగా, నిందితుడిపై స్వయంగా అతడి తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

రెండో పెళ్లితో మొదలైన గొడవలు..!

రేవా జిల్లాలోని గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంభీర్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ్ విశ్వకర్మకు ఇప్పటికే శాంతి విశ్వకర్మతో వివాహమైంది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే మొదటి భార్య, పిల్లలు ఉండగానే లక్ష్మీనారాయణ్ మరో మహిళ శశికళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇందుకోసం అతడు డబ్బులు కూడా చెల్లించినట్లు అతడి తండ్రి శివనాథ్ విశ్వకర్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండో భార్యను ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. లక్ష్మీనారాయణ్ తరచూ మొదటి భార్య శాంతితో వాగ్వాదానికి దిగేవాడని తెలుస్తోంది.

వంట చేస్తుండగా గొడ్డలితో దాడి!

శనివారం (నవంబర్ 28) శాంతి ఇంట్లో వంట చేసుకుంటుండగా పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. లక్ష్మీనారాయణ్ తన రెండో భార్య శశికళ, ఆమె కుమార్తె, కుమారుడితో కలిసి శాంతిపై దాడికి దిగినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. ఈ క్రమంలో గొడ్డలితో పలుమార్లు దాడి చేయడంతో శాంతి తీవ్రంగా గాయపడింది. దాడిలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది.

కోడలిని ఆసుపత్రికి తీసుకెళ్లి.. కొడుకుపై కేసు పెట్టిన తండ్రి!

ఈ ఘటనలో అత్యంత కీలకమైన విషయం నిందితుడి తండ్రి వ్యవహరించిన తీరు. తీవ్రంగా గాయపడిన కోడలిని చూసిన శివనాథ్ విశ్వకర్మ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కుమారుడితో పాటు మరో ముగ్గురిపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం శాంతి విశ్వకర్మ రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడిలో ఎవరెవరి పాత్ర ఎంత ఉందనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ కలహాలు చివరకు హత్యాయత్నానికి దారితీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us