తీరానికి కొట్టుకొస్తున్న విషపూరిత పాములు.. ముందెన్నడూ లేనిది.. ఇప్పుడే ఎందుకు!
El Niño Effect: సముద్ర తీరంలో సరదాగా గడపడానికి వెళ్లేవారికి షాకింగ్ న్యూస్! అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా బీచ్‌లలో అత్యంత విషపూరిత సముద్ర పాములు కొట్టుకొస్తుండటం కలకలం రేపుతోంది. తాజాగా ఎల్లో-బెల్లీడ్ సీ స్నేక్ సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. దీంతో ఇప్పటివరకు తీరానికి కొట్టుకొచ్చిన ఈ జాతి పాముల సంఖ్య ఎనిమిదికి చేరింది. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఈ పాములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సముద్రంలో ఏం జరుగుతోంది?

El Niño Effect: సముద్ర తీరంలో సరదాగా గడపడానికి వెళుతున్న వారికి షాకింగ్ న్యూస్! అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా బీచ్‌లలో అత్యంత విషపూరిత సముద్ర పాములు కొట్టుకొస్తుండటం కలకలం రేపుతోంది. తాజాగా ఎల్లో-బెల్లీడ్ సీ స్నేక్ సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. దీంతో ఇప్పటివరకు తీరానికి కొట్టుకొచ్చిన ఈ జాతి పాముల సంఖ్య ఎనిమిదికి చేరింది. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఈ పాములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సముద్రంలో ఏం జరుగుతోంది?
ఒక్కసారిగా కొట్టుకొస్తున్న సముద్ర పాములు!
సాధారణంగా దక్షిణ కాలిఫోర్నియా తీర ప్రాంతాల్లో కనిపించని ఎల్లో-బెల్లీడ్ సీ స్నేక్‌లు ఇప్పుడు వరుసగా ఒడ్డుకు చేరుతుండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత వారాంతంలో కనిపించిన పాము ఈ ప్రాంతంలో నమోదైన ఎనిమిదో పాముగా గుర్తించారు. ఈ పాముల శరీరం నలుపు రంగులో ఉండగా, కింది భాగం ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటుంది. చూడటానికి చిన్నగా, అందంగా కనిపించినప్పటికీ ఇవి అత్యంత విషపూరితమైనవి. అందుకే వీటిని చూసిన వెంటనే దగ్గరకు వెళ్లకుండా దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఎల్‌నినో ఎఫెక్ట్.. సముద్రంలో ఏం జరుగుతోంది?
ఎల్లో బెల్లీడ్ సీ స్నేక్‌లతో పాటు ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్లు కూడా కాలిఫోర్నియా తీర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. వెచ్చని సముద్ర జలాలు ఈ జీవులు సాధారణంగా కనిపించని ప్రాంతాలకు చేరుకునేందుకు కారణమవుతున్నాయి. ఈ అరుదైన సముద్ర జీవులు కాలిఫోర్నియా తీరానికి చేరుకోవడానికి కారణం ఎల్‌నినో ప్రభావమని భావిస్తున్నారు. సాధారణం కంటే సముద్రపు నీరు వెచ్చగా మారడంతో సముద్ర జీవుల కదలికల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఆలివ్ రిడ్లీ తాబేళ్లు.. మరో సంచలనం!
సముద్ర పాముల కలకలం కొనసాగుతుండగానే మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. శాంటా బార్బరా కౌంటీ బీచ్‌లో ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల గూడును గుర్తించారు. ఈ గూడు కాలిఫోర్నియా తీరంలో అరుదుగా కనిపించింది. దీంతో సముద్ర జీవుల సంచారంలో వస్తున్న మార్పులపై పరిశోధకుల్లో ఆసక్తి పెరిగింది.
ప్రజలతో కలిసి పరిశోధన
దీంతో అరుదైన సముద్ర జీవుల కదలికలను తెలుసుకునేందుకు నేచురల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ లాస్ ఏంజెల్స్ కౌంటీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక కమ్యూనిటీ సైన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. బీచ్‌కు వచ్చే ప్రజలు సముద్ర పాములు, తాబేళ్లు కనిపించినప్పుడు వాటి వివరాలను పరిశోధకులకు తెలియచేయాలని కోరింది. ఈ సమాచారంతో ఈ జీవుల సంచార విధానం, వాటిపై పర్యావరణ మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేయనున్నారు.
ముందెన్నడూ లేని విధంగా అరుదైన సముద్ర పాములు కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులు కొన్ని కీలక సూచనలు చేసారు. సముద్ర పాము కనిపిస్తే దానికి దూరంగా ఉండాలి. అది చనిపోయినట్లు కనిపించినా చేతులతో తాకకూడదు. ఫొటో తీయడానికి దగ్గరకు వెళ్లకూడదు. పాము కనిపించిన విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియచేయాలి. అలాగే సముద్ర తాబేళ్లు, వాటి గూళ్లకు ఎలాంటి హాని కలిగించకూడదు. విషపూరిత సముద్ర పాములు ఇంకా ఆలివ్ రిడ్లీ తాబేళ్లు కనిపించడంతో ఎల్‌నినో కారణంగా పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు జీవుల నివాస ప్రాంతాలు, సంచార మార్గాలపై ప్రభావం చూపుతున్నట్లు పర్యావరణవేత్తలు భావిస్తున్నారు.