Video: పులి దాడిలో వ్యక్తి దుర్మరణం!
ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పులులు ఉండే ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తిపై పులి దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో పార్క్‌లో కలకలం రేగింది. సందర్శకులను వెంటనే బయటకు పంపించిన అధికారులు, పార్క్‌ను తాత్కాలికంగా మూసివేశారు.
- Sharada V
- Updated on: Oct 11, 2026
- 9:22 am
పుట్టిన 28 రోజులకే స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. జెరోధా చరిత్రలోనే అతి చిన్న ఇన్వెస్టర్!
పెట్టుబడులు పెట్టాలంటే ఉద్యోగం రావాలి.. చేతిలో డబ్బులు ఉండాలి.. ఆర్థిక విషయాలపై అవగాహన ఉండాలి అనుకుంటాం. కానీ ఇప్పుడు ఓ బుజ్జాయి మాత్రం పుట్టిన నెల రోజుల్లోపే ఇన్వెస్టర్‌గా మారిపోయాడు. ఇంకా సరిగ్గా కళ్లు తెరిచి ప్రపంచాన్ని చూడని ఆ చిన్నారి.. స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టాడు. ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా లో ఖాతా తెరిచి పెట్టుబడి పెట్టిన ఈ బేబీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంతకీ ఆ చిన్నారి వయసెంతో తెలుసా? కేవలం 28 రోజులు మాత్రమే!
- Sharada V
- Updated on: Oct 10, 2026
- 9:48 pm
‘8లో 6 పనిచేయడం లేదు’.. విమానంలో టాయిలెట్ల సమస్య.. మధ్యలో దారి మళ్లించిన పైలట్!
విమాన ప్రయాణంలో చిన్న సమస్య ఎదురైనా కొన్నిసార్లు ప్రయాణికులకు పెద్ద ఇబ్బందే ఎదురవుతుంది. తాజాగా అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ అంతర్జాతీయ విమానంలో ఇదే జరిగింది. విమానంలో మొత్తం 8 టాయిలెట్లు ఉండగా.. ఏకంగా 6 పనిచేయకుండా పోయాయి. దీంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పైలట్ విమానాన్ని గమ్యస్థానానికి తీసుకెళ్లకుండా మధ్యలోనే దారి మళ్లించాడు.
- Sharada V
- Updated on: Oct 10, 2026
- 8:42 pm
మేకప్ వేసుకున్నా.. జుట్టు కనిపించినా సమస్యే! తాలిబన్ల వింత ఆంక్షలు
అఫ్గానిస్థాన్‌లో మహిళలపై తాలిబన్ల ఆంక్షలను ఎత్తిచూపుతూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మేకప్ వేసుకున్నా, రంగురంగుల స్కార్ఫ్ ధరించినా, జుట్టు కనిపించినా, పురుషుడు వెంట లేకుండా బయటకు వచ్చారనీ వింత కారణాలతో మహిళలను అదుపులోకి తీసుకుంటున్నారనీ తెలిపింది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 52 మంది మహిళలు, ఒక బాలికను తాలిబన్లు అరెస్ట్ చేసినట్లు తెలిపింది.
- Sharada V
- Updated on: Oct 10, 2026
- 8:16 pm
అడవిలో దాగిన భారీ పాములు.. డ్రోన్లతో వేటకు దిగిన శాస్త్రవేత్తలు!
అది మామూలు పాము కాదు.. ఏకంగా 16 అడుగుల పొడవు.. 67 కిలోల బరువుంటుంది! అమెరికా ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ ప్రాంతంలో ఈ భారీ బర్మీస్ కొండచిలువలు ఇప్పుడు శాస్త్రవేత్తలకు తలనొప్పిగా మారాయి. దట్టమైన అడవులు, చిత్తడి నేలలు, నీటితో నిండిన ప్రాంతాల్లో పాముల కోసం వెతకడం కష్టం కావడంతో తాజాగా డ్రోన్లను రంగంలోకి దించారు.
- Sharada V
- Updated on: Oct 10, 2026
- 4:56 pm
అల్గారిథమ్‌కి అర్థం లేదు.. సోషల్ మీడియాను మార్చేద్దాం.. ఆర్కుట్ ఫౌండర్ పిలుపు!
సోషల్ మీడియా అంటే ఒకప్పుడు స్నేహితులతో మాట్లాడటం, కొత్త పరిచయాలు పెంచుకోవడం, ఒకే అభిరుచులు ఉన్నవారితో కలవడం.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎన్ని గంటలు ఫోన్ చూస్తున్నాం? ఎన్ని లైక్స్ వచ్చాయి? ఎన్ని వ్యూస్ వచ్చాయి అనే లెక్కలే ఎక్కువయ్యాయి. మనుషుల మధ్య నిజమైన అనుబంధాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్కుట్ వ్యవస్థాపకుడు ఆర్కుట్ బ్యూక్కోక్తెన్. సోషల్ మీడియాను తిరిగి మనుషుల కోసం నిర్మించాలంటూ కొత్త ఉద్యమానికి పిలుపునిచ్చారు.
- Sharada V
- Updated on: Oct 10, 2026
- 3:52 pm
రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్ ఉద్యోగిని మృతిపై తల్లి సంచలన ఆరోపణలు!
రష్యాలో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. సైబీరియాలోని యాంటీ ప్లేగు పరిశోధనా సంస్థలో పనిచేసిన 29 ఏళ్ల దర్యా షిపిలోవా మృతి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తన కుమార్తె మరణంపై ఆమె తల్లి స్వెత్లానా తాజాగా స్పందించారు. తన కుమార్తె మరణానికి సంబంధించి వస్తున్న వార్తలను ఖండిస్తూ.. అధికారులు ఆమెను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
- Sharada V
- Updated on: Oct 10, 2026
- 3:21 pm
DonnaJean Wilde: ఏకబిగిన 5 గంటలు అబ్డామినల్ ప్లాంక్.. బామ్మ ప్రపంచ రికార్డు..!
వయసు 60 దాటితే శరీరం సహకరించదని, కష్టమైన వ్యాయామాలు చేయడం సాధ్యం కాదని చాలామంది అనుకుంటారు. కానీ కెనడాకు చెందిన 61 ఏళ్ల డోన్నాజీన్ వైల్డ్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేశారు. ఏకంగా ఐదు గంటల పాటు ప్లాంక్ వ్యాయామం చేసి తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తానే తిరగరాశారు.
- Sharada V
- Updated on: Oct 10, 2026
- 10:51 am
నిద్రపోతే చాలు రూ.13 లక్షల ప్రైజ్ మనీ! విజేతను ఎలా ఎంపిక చేస్తారంటే?
సాధారణంగా నిద్ర పోటీ అంటే ఎవరు ఎక్కువసేపు నిద్రపోతారో వారే విజేత అనుకుంటాం. కానీ జపాన్‌లో జరిగిన వింత పోటీలో నిద్ర నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పోటీలో పాల్గొన్నవారు కోలా కంపెనీకి చెందిన ప్రత్యేక మ్యాట్రెస్‌లపై పడుకుని 90 నిమిషాలు నిద్రపోవడానికి ప్రయత్నించారు. వారి నిద్రను ప్రత్యేక పరికరాల ద్వారా పర్యవేక్షించారు. వైద్యుల పర్యవేక్షణలో నిద్రకు సంబంధించిన అంశాలను పరిశీలించి స్కోర్ కేటాయించారు.
- Sharada V
- Updated on: Oct 10, 2026
- 10:12 am
AIపై స్టీఫెన్ హాకింగ్ చివరి హెచ్చరిక .. మానవాళికి ముప్పుగా ఏర్పడే ప్రమాదం!
తన జీవిత చివరి సంవత్సరాల్లో ఏఐ అభివృద్ధిపై హాకింగ్ పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మనుషుల సామర్థ్యాన్ని మించిపోయే స్థాయికి కృత్రిమ మేధస్సు చేరితే ఏమవుతుందనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఏఐ అభివృద్ధి మానవ చరిత్రలోనే గొప్ప పరిణామం కావచ్చని, అదే సమయంలో దాని ప్రమాదాలను నియంత్రించలేకపోతే మానవాళి భవిష్యత్తుకు ముప్పు కావచ్చని హెచ్చరించారు.
- Sharada V
- Updated on: Oct 10, 2026
- 9:44 am
Viral News : బాస్ బోనస్.. రూ. 45 లక్షలు ఖరీదు చేసే బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్!
చైనాలో ఓ రెస్టారెంట్ యజమాని ఉద్యోగులపై చూపించిన ప్రేమ, అభిమానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చలిని సైతం లెక్కచేయకుండా ఎలక్ట్రిక్ స్కూటర్లపై విధులకు వస్తున్న ఉద్యోగులను చూసి ఆమె చలించిపోయారు. వారి కష్టానికి గుర్తింపుగా ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చారు. ఉద్యోగుల శ్రమతోనే సంస్థ అభివృద్ధి చెందిందని నమ్మిన ఆమె.. ఆ విజయ ఫలాలను తన సిబ్బందికి అందించారు.
- Sharada V
- Updated on: Oct 10, 2026
- 8:59 am
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన దాడిని అడ్డుకోవడంలో ధైర్యంగా వ్యవహరించిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం పౌర శౌర్య పురస్కారాన్ని ప్రకటించింది. విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో ఆయన చూపిన ధైర్యం, సమయస్ఫూర్తిని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రశంసించారు. మచ్చర్ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిన తర్వాత, ఇజ్రాయెల్ ప్రజల తరఫున తానే స్వయంగా ఆ పురస్కారాన్ని అందజేస్తానని ప్రకటించారు.
- Sharada V
- Updated on: Oct 9, 2026
- 11:34 pm