AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siachen Glacier: మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద యుద్ధం చెయ్యడానికి సిద్ధంగా ఉండటం వారికి మాత్రమే సాధ్యం

ఎముకలు కొరికే చలి.. ఆక్సిజన్‌ లేక ఊపిరందక బేజారు.. శత్రు సైన్యం కాల్పులకు ప్రతిగా కాల్పులు జరపాల్సిన స్థితి.. సియాచిన్ గ్లేసియర్‌లో నిరంతరం కాపలా కాసే వేలాది మంది సైనికుల పరిస్థితి ఇది.

Siachen Glacier: మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద యుద్ధం చెయ్యడానికి సిద్ధంగా ఉండటం వారికి మాత్రమే సాధ్యం
సియాచిన్‌లో భారత సైన్యం
Sharada V
| Edited By: Ravi Panangapalli|

Updated on: Jun 19, 2024 | 12:28 PM

Share

ఎముకలు కొరికే చలి.. ఆక్సిజన్‌ లేక ఊపిరందక బేజారు.. శత్రు సైన్యం కాల్పులకు ప్రతిగా కాల్పులు జరపాల్సిన స్థితి.. సియాచిన్ గ్లేసియర్‌లో నిరంతరం కాపలా కాసే వేలాది మంది సైనికుల పరిస్థితి ఇది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రంలో మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు .. శత్రు శిబిరాల నుంచి దూసుకొచ్చే బుల్లెట్ల కన్నా ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు.. మంచు తుపాన్లు, హిమనీ నదాలు ఉన్న స్థలం. ఒకప్పుడు జమ్మూకాశ్మీర్​లో ఓ భాగం సియాచిన్. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన లద్ధాక్‌లో అంతర్భాగమైంది. టిబెట్ భాష ‘బాల్టీ’లో సియాచిన్ అంటే ‘గులాబీ వనం’ అని అర్థం. భారత ఆధీనంలో ఉన్న సియాచిన్‌పై 40 ఏళ్ల కిందట పాకిస్తాన్‌ కన్ను పడింది. పర్వతారోహకులను పంపించడం మొదలుపెట్టిన పాక్‌ అహంకారానికి అడ్డుకట్ట వేయాలన్న భారత ఆర్మీ వ్యూహాత్మక ఎత్తుగడే ఆపరేషన్‌ మేఘ్‌దూత్‌. పాక్‌ను విస్మయానికి గురి చేస్తూ 15 వేల అడుగుల ఎత్తులో దాడి చేసి గ్లేసియర్‌పై కన్నెత్తి చూడకుండా చేయగలిగింది భారత సైన్యం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం కాంట్రవర్సీ ఎందుకు? సియాచిన్ గ్లేసియర్ మొదటి నుంచీ వివాదాస్పదమే. దేశ విభజన సమయంలో వాస్తవాధీన రేఖకు అంచున మానవ మనుగడకు ఏ మాత్రం వీలు లేని సియాచిన్‌ ప్రాంతాన్ని అటు పాకిస్తాన్‌ కాని ఇటు ఇండియా గాని పట్టించుకోలేదు. 1949లో ఇండియా, పాకిస్తాన్ మధ్య కుదిరిన కరాచీ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి