ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ డేంజర్ బెల్స్.. ఏఏ రోగాలు వస్తాయో తెలుసా ??
ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కామన్ అయిపోయింది. ఇంట్లో నీళ్లు నిల్వ చేసుకోవడానికైనా, పని మీద బయటకు వెళ్లినపుడైనా, ఆఫీసులోనైనా ప్లాస్టిక్ బాటిల్ తప్పనిసరి. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ క్యాన్స్ తక్కువ ధరకే లభిస్తాయి కాబట్టి వీటిని వినియోగించడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు.
అయితే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మాత్రం వీటిని వినియోగించడం డేంజర్ అని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం వల్ల దాహం తీరడం సంగతి పక్కన పెడితే అనేక రోగాలను తీసుకువస్తోందని పరిశోధకులు అంటున్నారు. మానవ శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ కణాలు ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్ల ద్వారా చేరుతుండటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. చిన్న వాటర్ బాటిల్స్ మొదలు.. పెద్ద పెద్ద వాటర్ కంటైనర్‌ల వరకు ప్లాస్టిక్‌తో చేసినవి ఏవైనా సరే.. అందులో నీటిని నిల్వ చేసి తాగడం అనేది ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ రోజులు వాటర్‌నీ బాటిల్స్‌లో నిల్వ ఉంచడం వల్ల… ఆ ప్లాస్టిక్ బాటిల్స్‌లోని కెమికల్స్ వాటర్‌తో కంటామినేట్ అయి ముప్పు తీసుకొస్తుందని చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగితే కడుపులో పెరుగుతున్న శిశువు మెదడుపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ యూసేజ్ ఎక్కువైతే అది పిల్లల బ్రెయిన్‌పై ప్రభావం చూపిస్తుంది. అంతేకాక పిల్లల్లో యాంగ్జైటీ, జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం, డిప్రెషన్స్ లాంటి లక్షణాలు తొందరగా కనబడతాయని వైద్యులు అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో.. బిర్యానీ ఎంతపని చేసింది.. 8 గంటల పాటు ఆపరేషన్..
కిమ్ రాక్షస పాలన.. చివరికి అది కొనాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే
విశాఖ బీచ్‌లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే
గర్ల్స్ హాస్టల్‌లో అనుమానాస్పద వస్తువు.. ఏమిటా అని చూసినవాళ్లకు షాక్