విశాఖ బీచ్‌లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే
పీతల్లో చాలా రకాలు ఉంటాయి.. కొన్ని మంచి నీటి పీతలు.. మరికొన్ని ఉప్పు నీటి పీతలు. సముద్ర తీర ప్రాంతాల్లోనూ రకరకాల పీతలు కనిపిస్తూ ఉంటాయి. నీటిలో, తీరంలో, ఇసుక బొరియల్లో సాధారణంగా మనం వాటిని చూస్తూ ఉంటాం. విశాఖలోని సాగర్ నగర్ బీచ్‌లో అరుదైన పసుపు రంగు పీతలు కనిపించాయి. చూడటానికి భలేగా ఉండటంతో అవి ఏ జాతికి చెందినవన్న ఆసక్తి జనాల్లో పెరిగింది.
అటు ఇటు తిరుగుతూ.. ఒక్కోసారి ఉరుకులు పరుగులు పెడుతూ.. ఏదైనా హాని జరుగుతుందని అనిపిస్తే తనను తాను రక్షించుకునేందుకు ముడుచుకుంటూ ఈ ఎండ్రకాయలు సందడి చేశాయి. తీరంలో ఈ పీతలు తిరగడం అరుదని మత్స్యకారులు అంటున్నారు. ఇవి బొరియల్లో, లేకపోతే సముద్రంలో మాత్రమే ఉంటాయట. పగలంతా సముద్రంలో ఉన్నా చీకటి పడేసరికి మనిషి కంటపడకుండా బొరియల్లోకి దూరిపోతాయట. వలలకు ఈ పీతలు అస్సలు చిక్కవట.. కానీ భలే రుచిగా ఉంటాయని అంటున్నారు మరికొందరు మత్స్యకారులు. ఓసిపోడ్ క్వాడ్రాటా జాతికి చెందిన ఈ పీతలు.. ఉష్ణ మండల సమశీతోష్ణ ప్రాంతాల్లో నివసిస్తాయి. నిటారుగా పైకి కనిపించే వాటి కళ్ళు 360 డిగ్రీలు తిరుగుతాయి. చిన్న పీతలు ఇసుక రంగులో ఉంటాయి. అందుకే ఆ రంగులో ఈజీగా కలిసిపోతాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గర్ల్స్ హాస్టల్‌లో అనుమానాస్పద వస్తువు.. ఏమిటా అని చూసినవాళ్లకు షాక్
మరోసారి డాన్స్‌తో అదరగొట్టిన సాయి పల్లవి..
చడీచప్పుడు కాకుండా… శ్రీలీలతో లవ్‌స్టోరీ చేస్తున్న అఖిల్
హనీరోజ్ అమాయకురాలేం కాదు.. శరీరాన్ని చూపించి డబ్బులు.. నటి షాకింగ్ కామెంట్స్ !
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

