చడీచప్పుడు కాకుండా… శ్రీలీలతో లవ్‌స్టోరీ చేస్తున్న అఖిల్
అక్కినేని అఖిల్..! కింగ్ నాగార్జున వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అయ్యవారు. తన కెరీర్‌లో స్టిల్ బిగ్ హిట్ కొట్టేందుకు సఫర్ అవుతున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తాను చేసిన ప్రీవియస్ ఫిల్మ్ ఏజెంట్ డిజాస్టర్ అవ్వడంతో.. అప్పటి నుంచి మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.
ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ.. ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ.. చడీచప్పుడు కాకుండా మరో సినిమాను మొదలెట్టాడట అఖిల్. కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాను తెరకెక్కించిన కిరణ్ మురళీ కిషోర్ డైరెక్షన్లో.. అక్కినేని అఖిల్ ‘లెనిన్’ అనే సినిమా చేస్తున్నారట. ఈ మూవీలో అయ్యగారి పక్కన శ్రీలీల హీరోయిన్ నటిస్తున్నారట. ఇది చిత్తూరు నేపథ్యంలో సాగే గ్రామీణ యాక్షన్ లవ్‌స్టోరీ ఫిల్మ్ అని, ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని సమాచారం. ఈ సినిమా కొత్త షెడ్యూల్ మార్చ్ 14న హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుందని, దాదాపు ఇరవై రోజులు పాటు షూటింగ్ కొనసాగుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. అన్నపూర్ణ స్డూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హనీరోజ్ అమాయకురాలేం కాదు.. శరీరాన్ని చూపించి డబ్బులు.. నటి షాకింగ్ కామెంట్స్ !
SSMB29 నుంచి మరో సాలిడ్ అప్‌డేట్.. సంతోషం లో ఫ్యాన్స్
కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లికి మూగజీవి ఓదార్పు
పొట్లకాయా.. అని తీసిపారేయకండి.. ఈ సమస్యలన్నటికి చెక్ పెడుతుంది అంతే..
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

