పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నేరగాళ్లను పట్టుకోవడానికి పోలీసులు టెక్నాలజీని వాడుతుంటే, దొంగలు అంతకు మించిన తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు దుండగులు వేసిన 'బ్లాక్ స్ప్రే' ప్లాన్ ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో చర్చనీయాంశమైంది.
చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్యంగా తెల్లవారుజామున దొంగలు దోపిడీకి యత్నించారు. తాము చేసే ప్రతి కదలిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుందని ముందే పసిగట్టిన దొంగలు.. బ్యాంకు ఆవరణలోని కెమెరాలపై బ్లాక్ స్ప్రే కొట్టి వాటిని పని చేయకుండా చేశారు. అనంతరం షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో బ్యాంక్ షట్టర్‌ను కట్ చేస్తుండగా, ఒక్కసారిగా దోపిడీ హెచ్చరిక సైరన్ మోగింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన దొంగలు, పట్టుబడతామనే భయంతో అక్కడి నుంచి పరారయ్యారు. సైరన్ కారణంగా బ్యాంకులో ఉన్న భారీ నగదు, బంగారం సురక్షితంగా మిగిలాయి.బ్యాంకు సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు సేకరించారు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టిన విధానాన్ని చూస్తుంటే ఇది పక్కా ప్రొఫెషనల్ ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. టెక్నాలజీని వాడి తప్పించుకోవాలని చూసినా, భద్రతా వ్యవస్థ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని, బ్యాంకువారు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్
మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

