పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గ్యాస్ లీక్ ప్రమాదం జరిగింది. వంట సిలిండర్ మారుస్తుండగా మంటలు చెలరేగి వంట మనిషి, ఒక విద్యార్థినికి గాయాలయ్యాయి. సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో సుమారు 450 మంది విద్యార్థినులకు పెను ముప్పు తప్పింది.