సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో గేటుకు తాళం వేయాల్సి రాగా, అందుబాటులో తాళం లేకపోవడంతో సిబ్బంది ఏకంగా ఖైదీల బేడీలనే వాడారు. రౌడీ షీటర్లకు వేయాల్సిన సంకెళ్లు పోలీస్ స్టేషన్ గేటుకు ఉండటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.