కాకినాడ ఆర్టీసీకి వినియోగదారుల కమిషన్ రూ.15 వేల జరిమానా విధించింది. గత ఏడాది నవంబర్ 29న అఖిల్ అనే ప్రయాణికుడు టికెట్ కొన్నా సీటు లేకుండా బస్సులో రద్దీ కారణంగా ఇబ్బంది పడ్డాడు. మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనగా భావించి ఫిర్యాదు చేయగా, ఆర్టీసీకి జరిమానాతో పాటు టికెట్ సొమ్మును తిరిగి చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.