AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'అవెంజర్స్: డూమ్స్ డే' ట్రైలర్

Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 23, 2026 | 10:46 PM

Share

మార్వెల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే' ట్రైలర్ విడుదలైంది. థోర్, కెప్టెన్ అమెరికా, ఫెంటాస్టిక్ ఫోర్, బ్లాక్ పాంథర్, ఎక్స్-మెన్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించనున్నారు. ఐరన్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఈసారి విలన్ డాక్టర్ డూమ్‌గా అలరించనున్నారు. రుస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మార్వెల్ సినిమాలకు మన దగ్గర మార్వలస్ క్రేజ్ ఉంటుంది. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్, హల్క్, బ్లాక్ విడో.. ఇలా వీళ్లంతా ఇండియాలోనూ బాగా ఫేమస్సే. తాజాగా ఈ వరల్డ్ నుంచి మరో సినిమా రాబోతుంది. ఏడాది ఎండింగ్‌లో బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతున్నారు అవెంజర్స్. మరి ఈ సారి వాళ్ల వార్ ఎలా ఉండబోతుంది..? తాజాగా ట్రైలర్ వచ్చింది.. దానిపై ఓ లుక్కేద్దాం పదండి.. మార్వెల్ ఫ్యాన్స్‌కు జోష్ వచ్చింది.. వాళ్లెంతగానో వేచిచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ వచ్చేసింది. డిసెంబర్ 18న తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్‌లో విడుదల కానుంది ఈ చిత్రం. థోర్, కెప్టెన్ అమెరికా, ఫెంటాస్టిక్ ఫోర్, బ్లాక్ పాంథర్‌తో పాటు ఎక్స్-మెన్ హీరోలు కూడా ఒకే స్క్రీన్‌పైకి వచ్చి మల్టీవర్స్ మ్యాడ్‌నెస్ చూపించబోతున్నారు. ఐరన్ మ్యాన్‌గా సుపరిచితమైన రాబర్ట్ డౌనీ జూనియర్.. ఈసారి విలన్ డాక్టర్ డూమ్ పాత్రలో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నారు. ఇన్ఫినిటీ వార్, ఎండ్‌గేమ్ లాంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన రుస్సో బ్రదర్స్ అవెంజర్స్ డూమ్స్ డేను డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మూడు వేర్వేరు మార్వెల్ యూనివర్స్ సూపర్ హీరోలంతా కలిసి.. డాక్టర్ డూమ్‌తో చేసే పోరాటమే ఈ సినిమా కథ. క్రిస్ ఎవాన్స్, క్రిస్ హేమ్స్‌వర్త్, టామ్ హిడిల్‌స్టన్ లాంటి హాలీవుడ్ స్టార్స్ అంతా ఈ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. మార్వెల్ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తుంది ఈ చిత్రం. మొత్తానికి ఇండియన్ బాక్సాపీస్ దగ్గర సూపర్ హీరోల సినిమాలకు డిమాండ్ బాగానే ఉంటుంది.. మరి ఈ ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ విధ్వంసం ఎలా ఉండబోతుందో చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Follow Us