గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణ సమయంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూ సివేస్తారు. శ్రీకాళహస్తి ఆలయంతోపాటు దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లా పిఠా పురంలోని పాదగయ క్షేత్రాన్ని మాత్రం తెరిచే ఉంచుతారు. గ్రహణం వేళ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలకు అనుగుణంగా సూర్య,చంద్ర గ్రహణ సమయాల్లో పాదగయలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వరస్వామి ఆలయంతో పాటు అన్ని ఉపాలయాలను తెరిచే ఉంచుతారు.
మధ్యాహ్నం 3.20 గంటలు నుంచి సాయంత్రం 6.47గంటల వరకూ చంద్రగ్ర హణ ఉంటుంది. గ్రహణ సమయానికి 3 నుంచి 6గంటలు ముందుగా అన్ని ఆలయాలు తలు పులు మూసివేస్తారు.గ్రహణం పూర్తిగా విడిచిన తర్వాత మాత్రమే తెరుస్తారు. పాదగయ క్షేత్రంలో అందుకు భిన్నంగా అన్ని ఆలయాలు తెరిచే ఉంటాయి. చంద్రగ్రహణ సమయంలో కుక్కుటేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వ హిస్తారు. అర్చకులు, వేదపండితులు జపాన్ని ఆచరిస్తారు. పాదగయలో పట్టు, విడుపు స్నానాలు ఆచరించి గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి మరో మారు పూజాది కార్యక్రమాలు జరిపిస్తారు. గ్రహణ సమయంలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయానికి అనుగుణంగా పాదగయలోని కుక్కుటేశ్వరస్వామి ఆలయాన్ని తెరిచి ఉంచి పూజలు నిర్వహిస్తామని ఆలయ వేద పండితులు వింజమూరి సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్
మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

