జోరు చూపిస్తున్న తెలుగమ్మాయిలు.. ట్రెండ్ మారుతుందా..?
టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల హవా రోజురోజుకూ పెరుగుతోంది. వైష్ణవి చైతన్య, శ్రీ గౌరీప్రియ, శ్రీలీల వంటి హీరోయిన్లు నటన, గ్లామర్, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇతర ఇండస్ట్రీలపై ఆధారపడకుండా స్థానిక ప్రతిభకు అవకాశాలు కల్పిస్తే మరిన్ని విజయాలు సాధ్యమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
టాలీవుడ్‌లో ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు హీరోయిన్ అంటే ముంబై నుంచో, కేరళ నుంచో దిగుమతి చేసుకోవాలి అనే అన్ రిటన్ రూల్ ఉండేది. కానీ ఇప్పుడు మన తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలే కానీ.. సిల్వర్ స్క్రీన్ మీద రప్ఫాడిస్తున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. అటు పర్ఫార్మెన్స్, ఇటు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అదరగొడుతూ పక్క ఇండస్ట్రీల హీరోయిన్లకే గట్టి పోటీ ఇస్తున్నారు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్‌కి ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య ‘బేబీ’ మూవీలో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. బోల్డ్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్‌లో నటించిన ఈ బ్యూటీ సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేశారు. తెలుగమ్మాయిలు గ్లామర్ కే కాదు, క్యారెక్టర్‌లో ఇంటెన్సిటీ చూపించడంలోనూ ఏమాత్రం తీసిపోరని తన ప్రూవ్ చేశారు వైష్ణవి. లేటెస్ట్‌గా మరో తెలుగమ్మాయి శ్రీ గౌరీప్రియ కూడా తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నారు. ‘మ్యాడ్’ మూవీతో మెప్పించిన ఈ బ్యూటీ.. రీసెంట్‌గా వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’ లో డిఫరెంట్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు. కాంప్లెక్స్ లవ్ స్టోరీలో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూను ఎంతో కన్విన్సింగ్‌గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. చిన్న సినిమాలతో మొదలు పెట్టి స్టార్ లీగ్‌లోకి వచ్చిన శ్రీలీల బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తున్నారు. తన ఎనర్జిటిక్ డ్యాన్సులు, స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. వీళ్లందరి జోరు చూస్తుంటే.. పక్క ఇండస్ట్రీల నుంచి హీరోయిన్ల కోసం వెతుక్కోవడం కన్నా, మన వాళ్లకే అవకాశాలు ఇస్తే రిజల్ట్ ఇంకా బెటర్‌గా ఉంటుందన్న టాక్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lets Fix Our Food: ఊబకాయంపై యుద్ధం.. ICMR-NIN సంచలన నివేదిక
కెమెరామెన్‌కి బంపరాఫర్.. యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!
Weather Update: దూసుకొస్తున్న వాయు‘గండం’.. దంచికొట్టనున్న వర్షాలు.. వచ్చే మూడు రోజులు ముసురే
Cyber Crime:పార్శిల్ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!
ఇండియా పోస్ట్ పేరుతో కొత్త సైబర్ మోసం
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!

