తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది…. సొంత జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2008 లో లోకల్ ఛానెల్ 2009 -10 లో ABN , జీ 24 గంటలు తరవాత 2012 లో టీవీ5 క్రైమ్ డెస్క్ హైదబాద్, తరవాత 2012-13లో తులసి న్యూస్ లో అన్ని విభాగాలు ట్రైనింగ్ తరవాత 2014 లో మహా న్యూస్ లో వాయిస్ , న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ…తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో i&pr లో ఉద్యోగం చేశాను తరవాత 2015 లో cvr న్యూస్ ప్రజెంటర్, 2015,16,17 సంవత్సరంలో నెంబర్ వన్ న్యూస్ , ఐన్యూస్, studion n న్యూస్ లో పనిచేశాను తరవాత 2018 నుంచి టివి9 లో అడుగుపెట్టాను… తర్వాత విజయవాడ బ్యూరికి బదిలీ అయ్యి …. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Andhra Pradesh: తాచుపాము కరిచినా 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి..
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పాము కాటుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన వెంటనే.. కాస్త కోలుకున్నాక 10వ తరగతి పరీక్ష రాశాడు వై. నిస్సి అనే విద్యార్థి. అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు నిస్సీ.
- Pvv Satyanarayana
- Updated on: Mar 17, 2025
- 5:42 pm
AP News: చదువు ‘కొన’లేక చంపేశాడు.. ప్రొఫెషనల్ కిల్లర్లా.. కాకినాడ కేసులో కొత్త విషయాలు..
కాకినాడ లో మూడు మరణాలు కేసులో పోలీసులు విచారణ ప్రారంభించారు.. పక్కా ప్లాన్ ప్రకారం చంద్ర కిరణ్ ఇద్దరు పిల్లలను చంపి , తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. దానికి కావలసిన తాళ్లు ముందుగానే రెడీగానే ఉంచుకున్నాడు చివరిగా భార్యకి మిస్ యు అని మెసేజ్ చేశాడు.
- Pvv Satyanarayana
- Updated on: Mar 16, 2025
- 8:57 pm
స్నేహమంటే ఇదేరా..! యువకుడి మరణం తర్వాత అతని ఫ్రెండ్స్ చేసిన పని తెలిస్తే శభాష్ అంటారు!
ముమ్మిడివరంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తమ స్నేహితుడి జ్ఞాపకార్థం, అతని స్నేహితులు వందకు పైగా వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే తమ స్నేహితుడు మరణించాడని గుర్తు చేసుకుని, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సమాజ సేవ ద్వారా స్నేహితుడికి నివాళి అర్పించిన వారిని అందరూ అభినందిస్తున్నారు.
- Pvv Satyanarayana
- Updated on: Mar 10, 2025
- 9:01 pm
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్పై బెట్టింగ్! రాజానగరంలో బెట్టింగ్ ముఠాను పట్టుకున్న పోలీసులు
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలోని చక్రద్వారాభందం గ్రామంలో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ముఠాపై దాడి చేసి 20 మందిని అరెస్టు చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్కు సంబంధించి లక్షల రూపాయల బెట్టింగ్ జరిగిందని పోలీసులు తెలిపారు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో బెట్టింగ్ మాఫియా మరింత ముదిరిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
- Pvv Satyanarayana
- Updated on: Mar 10, 2025
- 8:56 pm
యూట్యూబర్ ఓవరాక్షన్.. గ్రౌండ్ మొత్తం తవ్వేసిన జనాలు.. చివరకు..
ఓ యూట్యూబర్ చేసిన పనికి గ్రౌండ్ మొత్తం తవ్వేశారు. మైదానం మొత్తం ఇష్టం వచ్చినట్లు గుంతలు తవ్వి పెట్టారు. అక్కడ జరుగుతున్న విషయం తెలుసుకుని జిల్లా క్రీడాధికారి పీఎస్. సురేష్ కుమార్ అక్కడకు చేరుకున్నారు. అసలు విషయం తెలిసి గుంతలు చేసినవారిపై మండిపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
- Pvv Satyanarayana
- Updated on: Mar 2, 2025
- 6:39 pm
AP: నడిరోడ్డుపై తగలబడ్డ బ్యాటరీ బైక్! భయాందోళనలకు గురైన స్థానికులు
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలుడు సంఘటన జరిగింది. ఇలాంటి ఘటనలు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్యాటరీల నాణ్యత, ఛార్జింగ్ పద్ధతులు, తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన అవసరం. ఈ ప్రమాదం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం తలెత్తే ప్రమాదం ఉంది.
- Pvv Satyanarayana
- Updated on: Mar 2, 2025
- 6:15 pm
శివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం.. భక్తులను ఆకట్టుకుంటున్న విభిన్న శివలింగాలు..
యోగాలో చెప్పబడిన నౌలీ అనే ప్రక్రియ ద్వారా గతంలో వినాయకుడు, నవదుర్గ ఆకృతులు, జాతీయ జెండా, యోగ డే లోగో, సేవ్ ట్రీస్ ఇలా సుమారు 50 కి పైగా కళాఖండాలను తన పొట్ట కండరాలపై చూపించి అబ్బుర పరిచా పరిచారు. తన పొట్ట కండరాల పై చూపించిన వివిధ ఆకృతులకు గాను గతంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబుల్ బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించారు సచ్చిదానంద యోగి.
- Pvv Satyanarayana
- Updated on: Feb 25, 2025
- 9:52 pm
Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహం.. 67 అడుగుల ఎత్తు 100 అడుగుల వెడల్పుతో..
గురు స్వామి సారథ్యంలో శరవేగంగా పనులు పూర్తి చేశారు...పూర్తిగా సిమెంట్ తో నిర్మించిన ఈ విగ్రహానికి రూ.30లక్షల వరకు ఖర్చయినట్లు గురుస్వామి తెలిపారు. ఇది కేవలం విగ్రహాన్ని చెక్కిన శిల్పికి మాత్రమే... విగ్రహానికి సిమెంట్ కి ఖర్చు మరో 25 లక్షలు అయినట్లు చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. విగ్రహం వెనుక భాగంలో యోగా, ధ్యానం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు... ఆదియోగి విగ్రహం వెనుక భాగంలో నిలువెత్తు శివలింగాన్ని ప్రతిష్టించారు.
- Pvv Satyanarayana
- Updated on: Feb 25, 2025
- 8:43 pm
రేకుల షెడ్డులో ఏటీఎం మిషన్.. TV9 ఏంట్రీతో సీజ్.. అసలేం జరిగిందంటే..!
కూరగాయల షాప్ ఏర్పాటు కోసం విద్యుత్ శాఖ అధికారుల వద్ద కనెక్షన్ తీసుకున్నారు. అయితే కూరగాయాలకు బదులుగా ATM సెంటర్ ఏర్పాటు చేయడం విచిత్రంగా ఉందని అన్నారు స్థానికులు. ఇంత జరుగుతున్న పంచాయతీ అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
- Pvv Satyanarayana
- Updated on: Feb 25, 2025
- 6:58 pm
Andhra Pradesh: ప్రేమ-పెళ్లి పేరుతో నయవంచన.. నిందితుడికి 10 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా!
తాళ్లరేవు మండలం చిన్న గోవలంక గ్రామానికి చెందిన కాశి మధుబాబు పెద్దల మాట సైతం వినకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుతో 2019లో ఐ.పోలవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుండి కోర్టులో ఈ కేసు వాదోపవాదాలు కొనసాగాయి. చివరికి ముద్దాయి మధుబాబుపై నేరం రుజువుకావడంతో జైలుశిక్ష విధించింది కోర్టు.
- Pvv Satyanarayana
- Updated on: Feb 22, 2025
- 6:59 pm
AP News: అంతుచిక్కని వ్యాధి పిట్టల్లా రాలుతున్న కోళ్లు.. లబోదిబోమంటున్న రైతులు
తెలుగు రాష్ట్రాల్లో మరో టెన్షన్ నెలకోంది. నిన్నటి వరకూ ఫారం కోళ్లను కాటేసిన బర్డ్ ఫ్లూ వైరస్ .. ఇప్పుడు టర్న్ తీసుకొని నాటుకోళ్లను కభళిస్తోంది. ఈవైరస్తో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నాటు కోళ్లు భారీగా చనిపోతున్నాయి. ఆ వివరాలు ఇలా
- Pvv Satyanarayana
- Updated on: Feb 21, 2025
- 10:00 pm
AP News: అయ్యో దేవుడా.! ఇదేం కర్మరా.. బర్డ్ ఫ్లూతో మరో 4 వేలకుపైగా కోళ్లు మృతి..
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. స్థానిక గంగాలమ్మ తల్లి ఆలయ సమీపంలోని పెద్ద కాలువ వద్ద ఉన్న కోళ్ల ఫారంలో మొత్తం కోళ్లలన్నీ చనిపోవడంతో ఇప్పుడు ఆ కోళ్ల ఫారం ఖాళీ అయింది. నిన్న మొన్నటి నుంచి కూడా చనిపోయిన కోళ్లను ఫారం ఎదుటే ఎండబెట్టిన దృశ్యాలు..
- Pvv Satyanarayana
- Updated on: Feb 17, 2025
- 7:24 pm