AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందరూ టీవీ సీరియల్‌ చూస్తున్న సమయంలో.. ఇంటి దొంగ చేతివాటం! ఆ తర్వాత సీన్ ఇదే..

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరని సామెతను సాకుగా చేసుకుని సర్పంచ్ ఇంటిలోనే దఫా దఫాలుగా దొంగతనం చేస్తున్న యువకుడిని సీసీ కెమెరా పట్టించింది. అది ఉమ్మడి కుటుంబం. నలుగురు కొడుకులు కోడళ్లతో నిత్యం హడావుడిగా తిరిగే ఆ ఇల్లు.. డ్రైవర్ గా వచ్చి ఆడవాళ్ళ వీక్నెస్ పట్టుకుని, సీరియల్ టైమ్ కు ఇంట్లోనే రెక్కీ చేసేవాడు..

అందరూ టీవీ సీరియల్‌ చూస్తున్న సమయంలో.. ఇంటి దొంగ చేతివాటం! ఆ తర్వాత సీన్ ఇదే..
Sarpanch House Robbery In East Godavari
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Feb 19, 2026 | 7:39 PM

Share

సీరియల్ సమయంలో ఇంటి కింద హాల్ లో అందరూ టీవీ చూసే సమయంలో.. ఇదే అనువుగా మార్చుకుని ఏకంగా 12 కాసుల బంగారు ఆభరణాలు, 4 లక్షలు క్యాష్ ను దఫా దఫాలుగా చోరీ చేశాడు ఆ ఇంటి డ్రైవర్. చివరకు సర్పంచ్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు చిక్కాడు. సర్పంచ్ ఇంట్లో దొంగతనం జరిగిందని ఈనోటా.. ఆనోటా.. విన్న గ్రామస్తులు పరమార్శకు తండోప తండాలుగా వచ్చారు..? ఇంతకు ఎక్కడ ఆ సర్పంచ్ ఇల్లు ..? ప్రెసిడెంట్ ఇంట్లో చోరీ కథేంటి..?

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో గ్రామ సర్పంచ్ ఇంట్లో డ్రైవర్ గా కొండలరావు చేరాడు. అనతి కాలంలోనే ఆ ఇంట్లో ఉన్న 20 మంది సభ్యుల్లో ఒకడిగా కొండలరావు చెలామని కాసాగాడు. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ఒక రూమ్ లో ఉంటూ, కలిసి తింటూ తిన్నింటి వాసాలను లెక్కెట్టాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. సర్పంచ్ మద్దాల రమణకు నలుగురు కొడుకులు కోడళ్లలు ఉన్నారు. ఇంట్లో ఎవరికి తెలియకుండా బంగారం, నగదు పోతున్నాయి. ఇవి ఎందుకు పోతున్నాయి? కొడుకులు కోడళ్ళు ఏదైనా అవసరం ఉంది తీసుకుంటున్నారా..? లేక మరెవరైనా ఈ పని చేస్తున్నారా అనే ఆలోచన పడింది. ఈ విషయం కొడుకులు, కోడళ్ళను అడిగితే గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని గ్రహించి సర్పంచ్ భార్య, భర్తలు ఇద్దరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సూచనలతో పకడ్బందీగా సీసీ కెమెరాలు సీక్రెట్ గా అమర్చారు. మళ్ళీ మరోమారు దొంగతనానికి అదే సీరియల్ సమయంలోనే వచ్చి కెమెరాలకు చిక్కాడు ఇంటి దొంగ.

దొంగతనం చేసే క్రమంలో సీసీ కెమెరాకు తలపై పెట్టుకునే టోపీ పెట్టి.. ఉంగరాలతో పారిపోయాడు. అనంతరం వీడియోదొంగతనానికి వచ్చిన శరకణం కొండలరావును, దండు అనిల్ కుమార్‌లను గుర్తించి పోలీసులకు అప్పగించారు. దర్యాప్తులో 12 కాసులు బంగారం ఆభరణాలను రికవరి చేసి మీడియా ముందు నిందితులను ఉంచారు. దొంగతనం చేసిన బంగారు ఆభరణాలు కోరుకొండ, శ్రీరంగపట్నం షాపులలో అమ్మినట్లు ముద్దాయిలు చెప్పడంతో బంగారు నగలు, లక్ష నగదు రికావరి చేశారు. సులువుగా 24 గంటల్లో మొత్తం దోపిడీ సొమ్మును రికవరీ చేశామని డీఎస్పీ శ్రీకాంత్ మీడియాకు వెల్లడించారు. ఇకపై ఎవరైనా తక్కువకు అమ్ముతున్నారని బంగారం కొంటే చర్యలు ఉంటాయని షాపు యజమానులకు హెచ్చరికలు జారీ చేశామని స్పష్టం చేశారు. నమ్మకాన్ని ఒమ్ముగా చేసి కుటుంబంలో చిచ్చు పెట్టాలని డ్రైవర్ గా చేరాడని, కి తగిన గుణపాఠం జరిగిందని సర్పంచ్ మద్దాల రమణ అన్నాడు. ప్రస్తుతం లక్ష రూపాయలు రికావరి జరిగిందని, నిందితుడు మరో మూడు లక్షలు బాధితుడికి ఇచ్చేలా పోలీసులు సమక్షంలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us