AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!

తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు ముదురుతోంది. గోదావరి జలాల నుంచి ఢిల్లీ నిధులు, ఉద్యోగాల భర్తీ వరకు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌ను కేంద్రంగా చేసుకుని ఇరు పార్టీలు ప్రజల్లో పైచేయి సాధించేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి.

నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
Telangana Sentiment
SN Pasha
|

Updated on: Aug 06, 2026 | 9:55 PM

Share

తెలంగాణ సెంటిమెంట్‌కు మూలం.. ‘నీళ్లు’. కోటి ఎకరాలకు, లక్షలాది రైతులకు ప్రాణాధారమైన ఈ జలాలపైనే. ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. గోదావరి, కృష్ణా నదీ జలాల సాక్షిగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మరోసారి జలయుద్ధం మొదలైంది. తెలంగాణ నీటి ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రాకు తాకట్టు పెట్టారంటూ మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపణలు గుప్పించారు. ఇంతకీ, గోదావరి బోర్డు మీటింగ్ అజెండాలో ఏముంది? తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై హరీష్‌రావు వాదన ఏంటి? దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రాకు తాకట్టు పెట్టడానికి కారణం.. నీటిపారుదల శాఖలో ఉన్న ఆంధ్రా అధికారులు అంటూ సెంటిమెంట్ అస్త్రం సంధించారు హరీష్‌రావు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో కీలక స్థానాల్లో ఉన్నవారంతా ఆంధ్రా మూలాలు ఉన్న వారేనంటూ ఓ లిస్ట్ బయటకు తీశారు. వాళ్లంతా తెలంగాణకు అన్యాయం చేస్తుంటే తెలంగాణ హక్కులను కాపాడాల్సిన అధికారులు, ఇంజినీర్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణలో తెలంగాణ కోసం పుట్టిన పార్టీలే అధికారంలో ఉండాలంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇందుకు, నీళ్ల అంశాన్నే ఉపయోగించుకున్నారు. తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడగడాన్ని తప్పు పట్టారు. బీఆర్ఎస్‌కు గురువు ప్రొఫెసర్ జయశంకర్ అయితే.. రేవంత్ రెడ్డికి గురువు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టే...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూబ్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూబ్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..