నా పేరు సయ్యద్ నాగ్‌పాషా. టీవీ9 తెలుగులో చీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2025 ఫిబ్రవరి నుంచి టీవీ9 తెలుగు వెబ్ సైట్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ, క్రికెట్‌కు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. అలాగే వైరల్, పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ కూడా రాస్తుంటాను. 2018లో కేరీర్ ప్రారంభించాను. జర్నలిజంలో 8 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో 2018 నుంచి 2021 వరకు సాక్షి వెబ్‌సైట్, ఖమ్మం యూనిట్ ఆఫీస్‌లో, 2021 నుంచి 2023 సుమన్ టీవీ వెబ్‌సైట్‌లో, 2023 నుంచి 2025 జనవరి వరకు ఐడ్రీమ్ వెబ్‌సైట్‌లో పనిచేశాను. 2017లో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందాను.
అభిషేక్ విధ్వంసాన్ని అడ్డుకున్న గిల్! కానీ, ఉన్నంతసేపు ఊచకోతే.. కేవలం 15 బంతుల్లోనే
షేర్ ఏ పంజాబ్ టీ20 లీగ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సులతో 49 పరుగులు చేశాడు. అయితే హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో శుబ్‌మన్ గిల్ పట్టిన అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.
- SN Pasha
- Updated on: Sep 8, 2026
- 1:26 pm
టీమిండియాతో టీ20.. గట్టి టీమ్ రెడీ చేసిన జపాన్! 15 మందితో స్క్వౌడ్ ప్రకటన
టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ భారత్‌తో చారిత్రాత్మక మ్యాచ్‌కు జపాన్ సిద్ధమైంది. సెప్టెంబర్ 22న సానో అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఇరు జట్లు తలపడనున్నాయి. కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ జపాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్టునే భారత్‌తో మ్యాచ్‌కు కూడా కొనసాగించారు.
- SN Pasha
- Updated on: Sep 8, 2026
- 12:41 pm
ఉద్యోగం మారితే EPFOలో ఈ మార్పులు చూసుకోండి! తప్పులుంటే మీరే మార్చుకోవచ్చు.. లేదంటే ఇబ్బందే
EPFO ఖాతాలో ఉద్యోగ విరమణ తేదీ తప్పుగా లేదా నమోదు కాకపోతే PF బదిలీ, విత్‌డ్రా, కొత్త ఉద్యోగం BGVలో సమస్యలు రావచ్చు. అర్హత ఉన్న సభ్యులు మాజీ యజమానిపై ఆధారపడకుండా UAN ద్వారా Date of Exitను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ OTPతో ధృవీకరణ పూర్తి చేసి సరైన తేదీని నమోదు చేయడం ద్వారా రికార్డులను సరిచేసుకోవచ్చు.
- SN Pasha
- Updated on: Sep 8, 2026
- 12:04 pm
పెయింటింగ్‌కి లక్షలు తగలేసే బదులు.. తక్కువ ఖర్చుతో ఇంటిని ఇలా అందంగా మార్చుకోండి!
ఇంటీరియర్ డిజైనింగ్‌లో చెక్క టైల్స్ ప్రస్తుతం కొత్త ట్రెండ్‌గా మారుతున్నాయి. టేకు, శీశం, పైన్, సెడార్ వంటి కలపతో తయారయ్యే ఈ టైల్స్ గోడలు, సీలింగ్‌లకు విలాసవంతమైన లుక్ ఇస్తాయి. చదరపు అడుగుకు రూ.150 నుంచి రూ.700 వరకు ధర ఉండే వీటిని సరైన నిర్వహణతో 25 నుంచి 30 ఏళ్ల వరకు ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
- SN Pasha
- Updated on: Sep 8, 2026
- 11:40 am
పాములు ఎక్కువగా ఏ టైమ్‌లో కాటేస్తాయి? రాత్రి, పగలు.. ఎప్పుడు డేంజర్?
వర్షాకాలంలో పాముల సంచారం పెరగడంతో కాటు ప్రమాదంపై ఆందోళన నెలకొంటుంది. ముఖ్యంగా రాత్రివేళల్లో కొన్ని పాము జాతులు చురుగ్గా ఉండటంతో జాగ్రత్త అవసరం. అయితే పగటిపూట కూడా పొలాలు, పొదలు, ఇళ్ల పరిసరాల్లో పాము కాటు సంభవించవచ్చు. టార్చ్ ఉపయోగించడం, పరిసరాలు శుభ్రంగా ఉంచడం, బూట్లు పరిశీలించడం వంటి జాగ్రత్తలతో ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
- SN Pasha
- Updated on: Sep 8, 2026
- 10:58 am
పిల్లల గొంతుతో ఫోన్.. తల్లిదండ్రులే టార్గెట్‌గా డీప్‌ఫేక్ మోసం! ఈ జాగ్రత్తలు తీసుకోండి..
AI డీప్‌ఫేక్ వాయిస్ మోసాలు పెరుగుతున్నాయి. పిల్లల గొంతును క్లోన్ చేసి తల్లిదండ్రులకు అత్యవసర పరిస్థితి అంటూ సైబర్ నేరగాళ్లు డబ్బులు అడుగుతున్నారు. ప్రమాదం, అరెస్ట్, ఆసుపత్రి పేర్లతో భయపెడుతున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.
- SN Pasha
- Updated on: Sep 8, 2026
- 10:43 am
మహిళా ఉద్యోగుల వివాదం.. ఈఫిల్ టవర్ మూసివేత!
పారిస్‌లోని ఈఫిల్ టవర్‌లో BAPS ప్రతినిధుల పర్యటన వివాదానికి దారితీసింది. మహిళా ఉద్యోగులను విధుల నుంచి పక్కకు తప్పించారనే ఆరోపణలతో సిబ్బంది నిరసనకు దిగారు. దీంతో ఈఫిల్ టవర్‌ను సందర్శకుల కోసం తాత్కాలికంగా మూసివేశారు. ఘటనపై SETE స్పందించగా, BAPS క్షమాపణలు తెలిపింది.
- SN Pasha
- Updated on: Sep 8, 2026
- 9:22 am
Money Scam: గణేశ్ నవరాత్రుల వేళ సైబర్ మోసాల వల.. దేవుడ్నీ వదలని దొంగనా కేటుగాళ్లు!
గణేశ్ నవరాత్రుల వేళ సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీశారు. తక్కువ ధరకే వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి, డెకరేషన్ వస్తువులు, లడ్డూ ప్రసాదం హోం డెలివరీ అంటూ నకిలీ ప్రకటనలు చేస్తున్నారు. అలాగే ఆన్‌లైన్ విరాళాల పేరుతోనూ డబ్బులు వసూలు చేస్తున్నారు.
- SN Pasha
- Updated on: Sep 8, 2026
- 8:13 am
Andhra Pradesh: అబార్షన్ పిల్స్ మింగిన 17 ఏళ్ల బాలిక.. మూడో రోజే దారుణం!
పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్యుల సూచనలు, పర్యవేక్షణ లేకుండా ఎంటీపీ కిట్ వాడిన 17 ఏళ్ల బాలిక తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. బోయపాలెంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా అబార్షన్ కిట్లు విక్రయించిన మెడికల్ షాపులపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.
- SN Pasha
- Updated on: Sep 8, 2026
- 7:38 am
ఇలాంటివి చెప్పండి భయ్యా.. EMI కట్టే పనిలేని బ్యాంక్ లోన్! ఎవరు, ఎంత తీసుకోవచ్చంటే..?
సాధారణ రుణాలకు భిన్నంగా, రివర్స్ మార్టగేజ్ లోన్ సీనియర్ సిటిజన్లకు ఒక వరంగా చెప్పవచ్చు. ఈ పథకం కింద, 60 ఏళ్లు పైబడిన వారు తమ ఇంటిని భద్రతగా చూపించి, బ్యాంకుల నుండి నిర్ణీత మొత్తాన్ని నెలవారీగా పొందవచ్చు. ఇది వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందిస్తుంది, EMI చెల్లించాల్సిన అవసరం లేదు.
- SN Pasha
- Updated on: Sep 8, 2026
- 7:13 am
వాట్సాప్‌లో మన మెసేజ్‌లు రైట్.. వచ్చే మెసేజ్‌లు లెఫ్ట్‌లోనే ఎందుకుంటాయ్? 99 శాతం మందికి తెలియదు
వాట్సాప్‌లో మనం పంపే మెసేజ్‌లు కుడివైపు, అవతలి వ్యక్తి పంపే మెసేజ్‌లు ఎడమవైపు ఎందుకు కనిపిస్తాయో తెలుసా? చాట్‌ను సులభంగా అర్థం చేసుకోవడం, ఎవరు ఏ మెసేజ్ పంపారో వెంటనే గుర్తించడం కోసం ఈ డిజైన్‌ను రూపొందించారు. ఇది కేవలం అందం కోసం కాదు.
- SN Pasha
- Updated on: Sep 7, 2026
- 1:27 pm
చలికాలం వచ్చేస్తోంది.. వింటర్ వేర్ తక్కువ ధరలో కావాలా? చెక్ ఇట్..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వింటర్ వేర్ తక్కువ ధరకు కొనాలంటే సరైన సమయం ఎంచుకోవాలి. అక్టోబర్–నవంబర్‌లో జాకెట్లు, థర్మల్స్ వంటి అవసరమైన దుస్తులు కొనడం మంచిది. జనవరి చివరి నుంచి ఫిబ్రవరి వరకు క్లియరెన్స్ సేల్స్‌లో స్వెటర్లు, క్యాప్స్, సాక్స్ తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది.
- SN Pasha
- Updated on: Sep 7, 2026
- 1:05 pm