ఎక్కడో క్షిపణుల మోత.. ఇక్కడ వంటింట్లో అంటుకున్న మంట.. పొంచి ఉన్న ఆర్థిక విపత్తు..!
యుద్ధం పేరెత్తగానే.. సరాసరి వంటింట్లోకే ప్రైస్ బాంబ్ వచ్చి పడుతుంది. చాలా మందికి ఓ డౌట్. క్షిపణులు పడేది అక్కడెక్కడో కదా.. నిజంగానే ఇక్కడ ధరలు పెరుగుతాయా అని..! కచ్చితంగా పెరుగుతాయి. అలాగే తగ్గుతాయి కూడా. మీరు ఉంటున్నది హైదరాబాద్ కావొచ్చు, విజయవాడ లేదా విశాఖ కావొచ్చు. ఒక్కో గుడ్డు దాదాపు 7 రూపాయలకు కొని ఉంటారు. ఇప్పుడెళ్లి షాప్‌లో అడగండి. ఐదు రూపాయలకొకటి ఇస్తానంటాడు. వద్దంటే అరటి పండ్లు కొని తెస్తారు ఇంట్లో వాళ్లు. కారణం.. మహా అయితే ఈ మూడు నాలుగు రోజుల్లోనే అరటిపండ్ల ధరలు విపరీతంగా పడిపోబోతున్నాయి. అవేనా.. ఉల్లి, కూరగాయల ధరలు సైతం దిగిరాబోతున్నాయి. ఇదంతా విన్నాక సామాన్యుడు సంబరపడొచ్చు. కాని, మరో రూపంలో వాత పెట్టబోతోంది యుద్ధం. గ్యాస్ బుక్ చేసి దాదాపు వారం అవుతోంది ఇంకా రావట్లేదని ఎదురుచూసే రోజులూ చూస్తాం. యూరియా కోసం మళ్లీ బారులు తీరడం చూసినా చూడొచ్చు. యూరియా కొరత వస్తే.. దిగుబడి తగ్గొచ్చు. అంటే.. దేశంలో నిత్యావసర సరుకు ధరలు భగ్గుమనడం చూడబోతున్నాం. అన్నిటికి మించి.. ఎగుమతులపై ఆధారపడిన పరిశ్రమలు తలపట్టుకోవడమూ చూస్తాం. ఓవరాల్‌గా.. ఈ యుద్ధం సామాన్యుడిపై పెద్ద ప్రభావమే చూపించబోతోంది. ఇంతకీ వేటి ధరలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి? డిటైల్డ్‌గా చూద్దాం..!

గల్ఫ్ దేశాలు ఏం కొనాలన్నా.. చివరికి మంచినీళ్లు కొనుక్కోవాలన్నా వాళ్ల దగ్గర ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ అమ్ముకోవాల్సిందే..! అంటే.. భారత్, ఇతర దేశాల నుంచి పళ్లు, కూరగాయలు వెళ్లాల్సిందే. ఒక వారానికి మించి గానీ గల్ఫ్‌కు సరుకులు వెళ్లకపోతే.. అక్కడ పుట్టేది ఆకలి రాజ్యమే. ఇది తెలిసి కూడా.. షిప్పులను రానివ్వడం లేదు. ఈ నష్టం ఒక్క గల్ఫ్‌కే కాదు.. మన రైతులకు కూడా పెద్ద కష్టాన్ని తెచ్చి పెట్టబోతోంది. అరటి పండ్లు, కోడిగుడ్ల గురించే మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. కాని, ఎంత మంది రైతులు, ఎన్ని పరిశ్రమలు ఎఫెక్ట్ అవబోతున్నాయో తెలుసా? ఇక ముహూర్తాలు మొదలైనట్టే కదా. కొత్త ఇంటిని ఎప్పుడు హ్యాండోవర్ చేస్తారని బిల్డర్‌ని అడిగారనుకోండి. తటపటాయించొచ్చు. చిన్న బిల్డర్లు ఎప్పుడు చేతికి తాళాలు ఇవ్వగలమో చెప్పలేని స్టేజ్‌లో ఉంటారు. కారణం.. యుద్ధం. రియల్ ఎస్టేట్ వరకూ వార్ ఎఫెక్ట్ తాకిందంటే.. ఇక మిగతా వాటి సంగతి? ఆలోచించక్కర్లేదు. అది కాదు, ఇది లేదు అనకుండా ప్రతి ఒక్క రంగంపైనా ఇంపాక్ట్ చూపించబోతోంది. యుద్ధం కేవలం సరిహద్దులకు పరిమితం కాదు. అది సామాన్యుడి వంటింటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ మూలాల వరకు పెను ప్రభావం చూపుతుంది. యుద్ధం వల్ల పెరిగే భయాందోళనలు ఊహలు కావు. అవి వాస్తవ రూపం దాల్చడానికి ఎంతో సమయం పట్టదనిపిస్తుంది. (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); ఇప్పుడు రాబోతున్న అతిపెద్ద కష్టం.. బుక్ చేసిన వెంటనే గ్యాస్ రాకపోవడం....
