మినిమం బ్యాలెన్స్ తిప్పలు లేవు..ఈ అకౌంట్‌ ఏ బ్యాంకులోనైనా తీసుకోవచ్చు!

August 05, 2026

Subhash

బ్యాంకులో జీరో బ్యాలెన్స్​ సేవింగ్స్ అకౌంట్ కోరుకునేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ ఒక బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పాల్సిందే.

జీరో బ్యాలెన్స్​

కేవలం ఆధార్, పాన్ కార్డ్‌ లేదంటే ఫామ్-60తో రూపాయి కూడా డిపాజిట్ లేకుండానే జీరో బ్యాలెన్స్ ఖాతాను ఈజీగా ఓపెన్ చేయొచ్చు. ఏజ్ లిమిట్ లేదు. 

డిపాజిట్

మీ అకౌంట్​లో ఒక్క రూపాయి లేకపోయినా బ్యాంకులు ఎలాంటి పెనాల్టీ విధించవు. దీనికి వార్షిక నిర్వహణ రుసుము వంటివి ఏమీలేని బేసిక్ రూపే ఏటీఎమ్ కార్డ్ లభిస్తుంది.

కలిగే ప్రయోజనాలు

బ్యాంకు కౌంటర్ లేదా ఏటీఎమ్‌ మెషీన్ల ద్వారా నెలలో ఎన్ని సార్లయినా, ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసుకోవచ్చు.

బ్యాంకు కౌంటర్

విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, గ్యాస్ సబ్సిడీ, పెన్షన్లు, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ ఆర్థిక పథకాలకు ఈ అకౌంట్​ లింక్ చేసుకోవచ్చు. ఆ డబ్బులు నేరుగా ఈ ఖాతాలో జమవుతుంది.

విద్యార్థులకు

మనీ విత్‌డ్రా విషయంలో రూల్స్‌ ఉన్నాయి. ఆన్‌లైన్ ట్రాన్స్​ఫర్, EMI పేమెంట్స్, ఇవన్నీ కలిపి గరిష్టంగా మీ ఖాతా నుంచి నెలలో 4 సార్లు మాత్రమే ఉచితంగా డబ్బులు తీసుకోవడానికి వీలవుతుంది.

పరిమితులు ఇవీ

నాలుగు ఫ్రీ విత్‌డ్రాయల్స్ దాటిన తర్వాత చేసే ప్రతీ అదనపు లావాదేవీపై బ్యాంకులు ప్రత్యేక ఛార్జీలు విధిస్తాయి. అవి సుమారు రూ.15 నుంచి రూ.20 వరకు ఉండవచ్చు.

ఫ్రీ విత్‌డ్రాయల్స్

BSBD అకౌంట్​ ఉన్న వ్యక్తికి అదే బ్యాంకులో రెగ్యులర్​ సేవింగ్స్ అకౌంట్​ ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఇప్పటికే ఆ ఖాతా ఉంటే.. బీఎస్​బీడీ అకౌంట్ ఓపెన్​ చేసిన 30 రోజుల్లోగా మూసివేయాల్సి ఉంటుంది.

అకౌంట్

ఫ్రీ చెక్ బుక్, క్రెడిట్ కార్డ్ వంటి సేవలు దాదాపుగా ఉండవు. కొన్ని బ్యాంకులు చెక్​ బుక్​ అవకాశం కల్పించినప్పటికీ ఏడాదికి 10 నుండి 25 చెక్కులను మాత్రమే ఉచితం. ఆ తర్వాత చెక్‌లకుఛార్జీలు

ఫ్రీ చెక్ బుక్