కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
మధ్యప్రదేశ్‌లోని మహిద్‌పూర్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో MEMU రైలు ఇంజన్‌పై హై-వోల్టేజ్ విద్యుత్ తీగ తెగిపడటంతో భారీ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించి, స్వల్ప గాయాలైన వారికి చికిత్స అందించారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మహిద్‌పూర్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రత్లాం నుండి కోటాకు ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ MEMU రైలు ఇంజన్‌పైకి 25,000 kV హై-వోల్టేజ్ ఓవర్‌హెడ్ విద్యుత్ తీగ అకస్మాత్తుగా తెగిపడి పడింది. దీంతో ఒక్కసారిగా భారీ షార్ట్ సర్క్యూట్ సంభవించి, ఇంజిన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రైలు ఇంజిన్‌లో మంటలు చూసిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో భయపడిపోయిన కొందరు ప్రయాణికులు రైలు కదులుతుండగానే కిందకు దూకేశారు. ఈ ఊహించని పరిణామంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. అయితే, సమయస్ఫూర్తితో వ్యవహరించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే లైన్‌కు సంబంధించిన విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సిబ్బంది తక్షణ చర్యలతో మంటలు మరింత విస్తరించకుండా అదుపులోకి వచ్చాయి. విద్యుత్ నిలిపివేయడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలైన వారికి ప్రథమ చికిత్స అందించారు. రైల్వే అధికారుల అప్రమత్తతతో పెను ముప్పు తృటిలో తప్పిందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్ కామెంట్స్.. తమిళనాడులో పెను దుమారం!
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు ‘సుప్రీం’ గ్రీన్ సిగ్నల్!
రూ.8000 కోట్ల డిపాజిట్లు.. ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్‌లోనే…!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం! అది నీడ కాదు.. పాము పడగే! “ట్రీ ఆఫ్ డెత్” స్టోరీ!
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

