నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు ‘సుప్రీం’ గ్రీన్ సిగ్నల్!
నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. అమాయక విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే తీవ్రమైన నేరచరిత్ర ఉన్నవారిపై కేసులు కొనసాగుతాయని తెలిపింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను ఆగస్టు 18కు వాయిదా వేసింది.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, తీవ్రమైన నేర చరిత్ర ఉన్నవారికి మాత్రం ఈ మినహాయింపు వర్తించదని తేల్చిచెప్పింది. జులై 20న ఢిల్లీలో జరిగిన ‘చలో సంసద్’ కార్యక్రమంలో విద్యార్థులపై పోలీసులు నమోదు చేసిన కేసులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. “విద్యార్థులపై అధిక బలాన్ని ప్రయోగించిన పోలీసులను వెనకేసుకురాకూడదు, అదే సమయంలో విద్యార్థుల ముసుగులో హింసకు పాల్పడిన వారిని వదిలిపెట్టకూడదు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అమాయక విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను వెనక్కి తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే, తీవ్రమైన నేరచరిత్ర కలిగిన సుమారు 2,700 మందిపై మాత్రం కేసులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ అంశంపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 18కి వాయిదా వేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.8000 కోట్ల డిపాజిట్లు.. ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్‌లోనే…!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం! అది నీడ కాదు.. పాము పడగే! “ట్రీ ఆఫ్ డెత్” స్టోరీ!
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్‌లోనే...!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం!
ఇందూరు నయాగర జలపాతం ఎప్పుడైనా చూశారా?
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!

