AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణికుడి దుస్సాహసం.. టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నం!

ప్రయాణికుడి దుస్సాహసం.. టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నం!

Phani CH
|

Updated on: Oct 04, 2026 | 9:44 PM

Share

హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరిన ఇండిగో విమానంలో టేకాఫ్‌కు ముందు కలకలం రేగింది. రన్‌వేపైకి వెళ్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు విమానం అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అప్రమత్తమైన క్యాబిన్‌ సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. అనంతరం ప్రయాణికుడిని విమానం నుంచి దించి విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడు అలా చేయడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన హంగామా తీవ్ర కలకలం రేపింది. విమానం టేకాఫ్‌ కావడానికి కొద్ది క్షణాల ముందు రన్‌వేపైకి వెళ్తున్న సమయంలో సదరు ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన క్యాబిన్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. దీంతో పెను ప్రమాదం త తప్పి..అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. టేకాఫ్ సమయంలో ఇలాంటి ఘటన జరగడంతో విమానంలో ఉన్న తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం సిబ్బంది ఆ ప్రయాణికుడిని వెంటనే విమానం నుంచి కిందకు దించి శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. అతడు విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ఎందుకు యత్నించాడు? తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడా? లేదా మద్యం, మత్తు పదార్థాల ప్రభావంలో అలా చేశాడా? లేక మానసిక స్థితి సరిగ్గా లేదా అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు కారణాలు విచారణ అనంతరం వెలుగులోకి రానున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పంటను కాపాడుకోబోయి.. ప్రాణాలే కోల్పోయారు!

తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చి వరుడితో ఏదో మాట్లాడింది.. ఉదయం చూసేసరికి వరుడు…

అమ్మబాబోయ్‌.. చిమ్మచీకట్లో గోడపై నక్కిన వింత ఆకారం!

Follow Us