నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘ప్యారడైజ్’ సినిమాపై వచ్చిన నెగటివ్ రివ్యూలు, కావాలని చేస్తున్న ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే సినిమాకు తక్కువ రేటింగ్స్ ఇచ్చారని ఆయన మండిపడ్డారు. రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమాపై ఇలాంటి ప్రచారం తగదని, నెగటివిటీ ప్రచారం చేసిన వాళ్ళు పురుగులు పట్టిపోతారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.