ఫాల్కన్ సూపర్‌నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్: ఈ ఫోన్ ధర 48.5 మిలియన్ డాలర్లు (రూ. 404 కోట్లు). దీనిని 24 క్యారెట్ల బంగారం, ప్లాటినం, పింక్ డైమండ్లతో తయారు చేశారు
ఐఫోన్ 4S ఎలైట్ గోల్డ్: దీని ధర 9.4 మిలియన్ డాలర్లు. ఈ ఫోన్‌లో 500కు పైగా వజ్రాలు, 24 క్యారెట్ల బంగారు వెనుక కవర్ ఉన్నాయి.
ఐఫోన్ 4 డైమండ్ రోజ్ ఎడిషన్: ఈ ఫోన్ ధర 8 మిలియన్ డాలర్లు (రూ. 66.81 కోట్లు). ఇందులో 500 వజ్రాలు, పింక్ గోల్డ్ లోగో ఉంటాయి
గోల్డ్‌స్ట్రైకర్ ఐఫోన్ 3GS సుప్రీం: దీని ధర $3.2 మిలియన్లు (రూ. 26.72 కోట్లు). ఈ ఫోన్‌ను 271 గ్రాముల బంగారం, 53 వజ్రాలతో పొదిగారు.
ఐఫోన్ 3G కింగ్స్ బటన్: ఈ ఫోన్ ధర 2.5 మిలియన్ డాలర్లు. ఇందులో 138 వజ్రాలు, 6.6 క్యారెట్ల హోమ్ బటన్ ఉన్నాయి.
డైమండ్ క్రిప్టో స్మార్ట్‌ఫోన్: దీని ధర $1.3 మిలియన్లు. ఈ ఫోన్‌లో 50 వజ్రాలు పొదిగి ఉన్నాయి. దీని బాడీ ప్లాటినంతో తయారు చేయబడింది.
గోల్డ్‌విష్ లే మిలియన్: ఈ ఫోన్ ధర 1 మిలియన్ డాలర్లు . దీనిపై 18 క్యారెట్ల తెల్ల బంగారం, 120 క్యారెట్ల వజ్రాలు పొదిగి ఉన్నాయి.
గ్రెసో లక్సర్ లాస్ వెగాస్ జాక్‌పాట్: దీని ధర $1 మిలియన్. ఈ ఫోన్‌లో 45.5 క్యారెట్ల నల్ల వజ్రాలు, 200 ఏళ్ల నాటి ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్‌తో చేసిన వెనుక కవర్ ఉన్నాయి.
వెర్టూ సిగ్నేచర్ కోబ్రా: ఈ ఫోన్ ధర $310,000 (రూ. 2.58 కోట్లు). దీనిపై 439 కెంపులు, 2 పచ్చలు పొదిగి ఉన్నాయి.
బ్లాక్ డైమండ్ VIPN స్మార్ట్‌ఫోన్: దీని ధర $300,000. ఈ ఫోన్‌లో రెండు వజ్రాలు, టైటానియం బాడీ ఉన్నాయి.