వరుణ్ తేజ్ తమ ప్రేమకథ గురించి మాట్లాడుతూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ను నమ్మనని స్పష్టం చేశారు. లావణ్య త్రిపాఠి అందరితో, ముఖ్యంగా సహోద్యోగులు మరియు సహాయకులతో ప్రవర్తించే తీరును గమనించిన తర్వాతే ఆమె మంచి హృదయం ఉన్న వ్యక్తి అని, తనకి సరైన భాగస్వామి అని నిర్ధారించుకున్నానని తెలిపారు.