పైకి.. కిట్ కాట్ చాక్లెట్ ప్యాకెట్.. ఓపెన్ చేస్తే కళ్లు జిగేల్!
ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిట్‌కాట్ చాక్లెట్ బాక్సుల్లో దాచిన రూ.2 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
దేశంలో డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా, స్మగ్లర్లు ఎత్తుకు పైఎత్తు వేస్తూ వినూత్న పద్ధతుల్లో మత్తుపదార్థాలను సరిహద్దులు దాటిస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. కిట్ కాట్ చాక్లెట్ బాక్సులలో దాచి స్మగ్లింగ్ చేస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఓ ప్రయాణికుడు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వచ్చాడు. అతను విమానాశ్రయంలో కస్టమ్స్ గ్రీన్ ఛానల్ దాటేందుకు యత్నించాడు. ఆ ప్రయాణికుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన అధికారులు అతడి లగేజీని నిలిపివేసి ఎక్స్-రే స్క్రీనింగ్ నిర్వహించారు. లగేజీ బ్యాగ్‌లో ఉన్న కిట్ కాట్ చాక్లెట్ బాక్సులను పరిశీలించగా, వాటిలో 4 వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లలో సుమారు 2.759 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. చాక్లెట్ బాక్సుల్లో గంజాయిని చూసి షాక్ తిన్న కస్టమ్స్ అధికారులు వెంటనే ఆ గంజాయిని జప్తు చేశారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్ కామెంట్స్.. తమిళనాడులో పెను దుమారం!
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు ‘సుప్రీం’ గ్రీన్ సిగ్నల్!
రూ.8000 కోట్ల డిపాజిట్లు.. ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్‌లోనే…!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం! అది నీడ కాదు.. పాము పడగే! “ట్రీ ఆఫ్ డెత్” స్టోరీ!
పైకి.. కిట్ కాట్ చాక్లెట్ ప్యాకెట్.. ఓపెన్ చేస్తే..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్‌లోనే...!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం!
ఇందూరు నయాగర జలపాతం ఎప్పుడైనా చూశారా?
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

