కలెక్టర్ అవుతానని చెప్పి.. ఇలా చేశావేంటి తల్లీ.. ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు..!
కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన ఐఐటీ గువాహటి బీటెక్ విద్యార్థిని చేతన బ్రహ్మపుత్రా నదిలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. భార్యను కోల్పోయిన తర్వాత ఒక్కగానొక్క కుమార్తెనే ఆశగా చూసుకున్న తండ్రి సాయినాథ్ రెడ్డి రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
“బాగా చదువుకొని సివిల్స్ రాసి కలెక్టర్ అవుతానమ్మా అని చెప్పావు కదా తల్లీ.. నన్ను ఇలా ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయావా?” అంటూ ఆ తండ్రి ఆవేదనతో రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం గ్రామంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. జమ్మలమడుగు తహశీల్దారుగా పనిచేస్తున్న సాయినాథ్ రెడ్డి కుమార్తె చేతన అస్సాంలోని ఐఐటీ గువాహటిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే, అక్కడి బ్రహ్మపుత్రా నది వద్దకు విహారానికి వెళ్లిన చేతన అనుకోకుండా నదిలో పడి ప్రాణాలు కోల్పోయింది. పదేళ్ల క్రితమే భార్య మంజుల అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆ బాధను గుండెల్లో దాచుకుని తన ఒక్కగానొక్క కూతురిని సాయినాథ్ రెడ్డి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పెద్ద చదువులు చదివించి ప్రయోజకురాలిని చేయాలనుకున్న తండ్రికి, కూతురు చావు వార్త పిడుగులా తగిలింది. పదేళ్ల కిందట భార్యను, ఇప్పుడు కంటికి రెప్పలా చూసుకున్న కన్న కూతురిని కోల్పోయి ఆ తండ్రి పూర్తిగా ఒంటరివాడయ్యాడు. ఐఐటీ చదివి కలెక్టర్ అవుతుందనుకున్న కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో, సాయినాథ్ రెడ్డి గుండెలవిసేలా రోధిస్తున్నాడు. ఈ ఘటన పెద్దముడియంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సారూ.. మా ఊరికి బస్సెయ్యరూ..! ఆరేళ్ల చిన్నారి విజ్ఞప్తి
విస్తరిస్తున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు ఆ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు
పిల్లల ప్రాణాలు తీస్తున్న అరుదైన వైరస్.. హైఅలర్ట్ ప్రకటించిన సర్కార్!
పైకి.. కిట్ కాట్ చాక్లెట్ ప్యాకెట్.. ఓపెన్ చేస్తే కళ్లు జిగేల్!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

