ఈ పొరపాట్లే కొంపముంచుతాయి.. కారు ఇంజన్ పనికిరాకుండా పోయే తప్పులు..!

August 04, 2026

Subhash

మీ కార్ లేదా బైక్ ఇంజన్ ఆయుష్షు తగ్గించే చిన్న చిన్న పొరపాట్లు ఏంటో తెలుసుకోండి. చిన్న పొరపాట్లు పెద్ద నష్టం కలుగుతుందని గుర్తించుకోండి.

ఇంజన్ తప్పులు

మీరు మీ కారు ఇంజన్‌ ఆయిల్‌ను సకాలంలో మార్చకపోవడం లేదా ఆయిల్ ఫిల్టర్ మార్చకపోతే ఇంజన్ భాగాలు అరిగిపోయి జామ్ అవుతాయి.

ఇంజన్ ఆయిల్ మార్చకపోవడం

మీ కారులో కూలెంట్‌ లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారవచ్చని గురించుకోండి. రేడియేటర్‌లో కూలెంట్ తగ్గితే ఇంజన్ విపరీతంగా వేడెక్కి (Overheat) తీవ్రంగా దెబ్బతింటుంది.

కూలెంట్ లేకపోవడం

డ్యాష్‌బోర్డ్‌లో ‘చెక్ ఇంజన్’ లైట్ వెలిగినా పట్టించుకోకపోతే పెద్ద మరమ్మతులకు దారితీస్తుంది. అందుకే వాహనం నడిపే ముందు ఇలాంటివి నిర్లక్ష్యం చేయకూడదు.

వార్నింగ్ లైట్ల నిర్లక్ష్యం

తక్కువ వేగంలో ఎక్కువ గేర్, లేదా రేసింగ్ గేర్‌ మార్పులు ఇంజన్ పిస్టన్లపై విపరీతమైన భారం మోపుతాయి. దీని వల్ల కూడా మీ కారు ఇంజన్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది.

తప్పుడు గేర్ డ్రైవింగ్

చాలా మంది చేసే పొరపాటు ఇదే. మునిగిన రోడ్లలో ఇంజన్ ఆగిపోతే మళ్లీ స్టార్ట్ చేయవద్దు (Hydro-lock వల్ల ఇంజన్ పూర్తిగా పాడవుతుంది).

 నీళ్లలో వాహనాన్ని స్టార్ట్ చేయడం

నాణ్యత లేని లేదా కల్తీ పెట్రోల్/డీజిల్ వాడితే ఇంజన్ ఫ్యూయల్ ఇంజెక్టర్లు త్వరగా పాడవుతాయి. దీని వల్ల మీ కారు ఇంజిన్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది.

కల్తీ ఇంధనం వాడకం

మీ  కారును సరైన సమయంలో సర్వీసింగ్ చేయిస్తే మీ వాహనం ఇంజన్ ఏళ్ల తరబడి పటిష్టంగా పనిచేస్తుంది. చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు.

సకాలంలో సర్వీసింగ్