కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు శుభవార్త అందించింది. ప్రతి నెలా రేషన్ దుకాణాలకు వెళ్లే ఇబ్బందులు తొలగించేందుకు, ఏప్రిల్ 1న మూడు నెలలకు సరిపడా రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కోటి కార్డుదారులు, 6 కేజీల సన్న బియ్యం పంపిణీ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.