ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలు తెలుగు రాష్ట్రాల పౌల్ట్రీ పరిశ్రమను కుదిపేశాయి. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు కోడిగుడ్డు ఎగుమతులు నిలిచిపోవడంతో గుడ్డు ధరలు ఐదు- ఏడు రూపాయల నుండి మూడున్నర నుండి నాలుగున్నర రూపాయలకు పడిపోయాయి. రోజుకు ఐదు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంచనా. రైతులు, పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.