AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి..

ప్రకృతి మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాలను అందించింది. వాటిలో ముఖ్యమైనవి కాయలు, పండ్లు. ఇవి మంచి రుచితో పాటు శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తాయి. అలాంటి ఒక విదేశీ పండు, ప్రస్తుతం మన దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఎక్కువగా సాగవుతూ, అందుబాటులోకి వచ్చింది. అదే రాంబుటాన్. ఇది చూడటానికి లిచీ పండును పోలి ఉంటుంది. కానీ, దీనిపై ఎర్రటి రంగులో మెత్తటి ముళ్లు ఉంటాయి.

Jyothi Gadda
|

Updated on: Aug 26, 2026 | 9:59 PM

Share
లిచీ లాగే తెల్లటి గుజ్జును కలిగి ఉండే ఈ పండు, మీరు నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. కొద్దిగా తీపి, పులుపు కలయికతో ఉండే దీని రుచి అందరినీ ఆకట్టుకుంటుంది. చిన్నగా అనిపించినప్పటికీ, ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. రాంబుటాన్ పండులో ఐరన్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, కాల్షియం, భాస్వరం, విటమిన్ బి3, ప్రోటీన్ వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

1 / 5
గుండె ఆరోగ్యం: రాంబుటాన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని, అధిక రక్తపోటును తగ్గించడంలో తోడ్పడుతుంది.

2 / 5
ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది మలబద్ధకం సమస్యను నివారించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పండులో నీటి శాతం ఎక్కువ. ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో శక్తివంతంగా పనిచేస్తుందని నమ్ముతారు. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మంపై ముడతలు, అకాల వృద్ధాప్యాన్ని నివారించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది.

3 / 5
ఇందులో ఉండే భాస్వరం, విటమిన్ సి ఎముకలను నిర్మించడానికి, బలోపేతం చేయడానికి సహాయపడతాయి. రాంబుటాన్‌లోని యాంటీఆక్సిడెంట్లు వాపుతో పోరాడతాయి. ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. తద్వారా వివిధ రకాల క్యాన్సర్‌ల నుండి, ముఖ్యంగా కాలేయ క్యాన్సర్ నుండి రక్షణ కల్పించగలవు. కొన్ని నివేదికల ప్రకారం, ప్రతిరోజూ ఐదు రాంబుటాన్లు తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

4 / 5
జాగ్రత్తలు: రంబుటాన్ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, గర్భిణీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, అధిక రక్తపోటు ఉన్నవారు ఈ పండును తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. మధుమేహంలో ఇది మంచిదే అయినప్పటికీ, మితంగా తీసుకోవడం ముఖ్యం. ఈ పండు సీజన్ ప్రధానంగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఉంటుంది. ఇది ఎరుపు లేదా పసుపు రంగులో లభిస్తుంది. శరీరంలో గాయాలు త్వరగా మానేలా చేసే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి.

5 / 5
Follow Us
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!

పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు

పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్ లకు డిమోషన్..!

బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. కోట్లలో కలెక్షన్స్..

హోటల్‌లో ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా..? ఇకపై అక్కర్లేదు..