గుమ్మడి గింజలు చేసే మ్యాజిక్ తెలుసా? గుప్పెడు తిన్నా గుండె పదిలమే

samatha

17 November 2026

Pic credit - Pinterest

గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది గుమ్మడి గింజలను ఎక్కువగా తమ డైట్‌లో చేర్చుకుంటారు

గుమ్మడి గింజలు

ముఖ్యంగా గుమ్మడి గింజల్లో  జింక్, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల తొందరగా జబ్బులు రావు. ఆరోగ్యానికి మంచిది.

జింక్ విటమిన్ ఇ

నిద్రలేమి సమస్యతో బాధపడే వారు గుమ్మడి గింజలు తినడం చాలా మంచిది. ఇందులో ఉండే మెగ్నీషియం మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.

నిద్రలేమి

గుండె ఆరోగ్యానికి గుమ్మడి గింజలు చాలా మంచివి. వీటిలో మంచి కొవ్వులు ఉంటాయి, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

గుండె ఆరోగ్యం

అంతే కాకుండా ఎవరు అయితే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారో వారికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి.

రక్తహీనత

గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన వీటిని తినడం వలన మలబద్ధకం తగ్గి, కడుపు తేలిక అవుతుంది.

మలబద్ధకం

గుమ్మడి గింజల్లో  కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది ఎముకల బలానికి, దంతాలు గట్టి పడటానికి ఉపయోగపడుతుంది.

ఎముకల బలం

పాతకాలం నుంచి గుమ్మడి గింజలను పురుగులకు వాడతారు.  వీటిని తినడం వలన కడుపులో పురుగులు చనిపోతాయి. కడుపును శుభ్రం చేస్తాయి.

ఎముకల బలం