Kove 650RR ఫీచర్లు తెలిస్తే బైక్ లవర్స్‌కు నిజంగా పిచ్చెక్కిపోద్ది.. సూపర్ బైక్ అంటే ఇదేనా అనిపిస్తుంది
చైనాకు చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ Kove తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్పోర్ట్స్ బైక్ Kove 650RRను పరిచయం చేసింది. ఇప్పటికే కంపెనీ గ్లోబల్ మార్కెట్లో 450RR, 350RR, 250RR వంటి స్పోర్ట్స్ బైక్‌లను అందిస్తోంది. తాజాగా ఈ లైనప్‌లోకి మరింత శక్తివంతమైన 650RR చేరింది. ఇందులో 645cc ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్ ఇంజిన్, ఆధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లు, స్పోర్టీ డిజైన్‌ను అందించారు. అధిక వేగంతో ప్రయాణించేందుకు ఇష్టపడే బైక్ ప్రియులను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్‌ను రూపొందించారు.

కొత్త బైక్‌లో కేవలం ఇంజిన్ పనితీరుకే కాకుండా రైడింగ్ సేఫ్టీ, కంట్రోల్, టెక్నాలజీకి కూడా కంపెనీ ప్రాధాన్యత ఇచ్చింది. 6-యాక్సిస్ IMU, కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ముందు, వెనుక కెమెరాలు, లేన్ చేంజ్ అసిస్ట్ వంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. కంపెనీ సమాచారం ప్రకారం గ్లోబల్ డెలివరీలు 2027 మూడో త్రైమాసికం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
645cc ఇంజిన్
Kove 650RRలో 645cc ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 13,000rpm వద్ద 108.7hp గరిష్ట పవర్‌ను, 11,000rpm వద్ద 60Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్విన్-స్పార్ ఫ్రేమ్‌తో రూపొందించిన ఈ బైక్‌లో ఇంజిన్‌ను స్ట్రెస్డ్ మెంబర్‌గా ఉపయోగించారు. అల్యూమినియం సబ్‌ఫ్రేమ్, అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్, అడ్జస్టబుల్ సస్పెన్షన్ వంటి హార్డ్‌వేర్ ఫీచర్లు ఉన్నాయి. దీని కర్బ్ వెయిట్ 195 కిలోలు కాగా, 17 లీటర్ల అల్యూమినియం ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. సీట్ హైట్ 810mmగా ఉంది.
అధునాతన ఫీచర్లు
ఎలక్ట్రానిక్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6-యాక్సిస్ IMU ఆధారిత కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. మూడు రైడింగ్ మోడ్‌లు అందించారు. బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ ద్వారా క్లచ్ ఉపయోగించకుండా గేర్లను పైకి, కిందికి మార్చుకోవచ్చు. 6 ఇంచుల TFT డిస్‌ప్లేకు Motoplay సపోర్ట్ కూడా ఉంది. ముందు, వెనుక కెమెరాలతో పాటు లేన్ చేంజ్ అసిస్ట్ ఫీచర్‌ను అందించారు.
బ్రేకింగ్ కోసం ముందు భాగంలో ట్విన్ ఫ్లోటింగ్ డిస్క్‌లు, ఫోర్-పిస్టన్ కాలిపర్లు ఇచ్చారు. వెనుకవైపు సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంది. IMU ఆధారిత కార్నరింగ్ ABSతో సేఫ్టీ వ్యవస్థను మరింత మెరుగుపరిచారు. అయితే ఈ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసే విషయంపై Kove ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గ్లోబల్ డెలివరీలు 2027 మూడో త్రైమాసికంలో ప్రారంభమవుతాయనే అంచనా మాత్రమే ప్రస్తుతం ఉంది.
