రెస్టారెంట్‌లో శాండ్‌విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో కదులుతూ కనిపించిన
గురుగ్రామ్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. శాండ్‌విచ్ తింటుండగా అందులో సజీవంగా ఉన్న పురుగు కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్‌గా మారింది. రెస్టారెంట్‌లలో ఆహార భద్రత, పరిశుభ్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.
చాలా మందికి శాండ్‌విచ్‌లు అంటే చాలా ఇష్టం ఉంటుంది. రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు వాటిని ఎంతో ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. అయితే, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో డెకరేషన్, టేబుల్స్ ఉన్నంత శుభ్రంగా ఫుడ్ ఉండదనే వాదనకు గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఘటనే తాజా ఉదాహరణ. గురుగ్రామ్‌లోని ప్రసిద్ధ పాల్ రెస్టారెంట్‌కు వెళ్ళిన ఒక కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేశారు. రకరకాల వంటకాలతో పాటు శాండ్‌విచ్‌ను కూడా సగం వరకు తిన్నారు. సరిగ్గా అదే సమయంలో ఆయన కంటపడిన దృశ్యం చూసి గుండె ఆగినంత పనైంది. శాండ్‌విచ్ లోపల తెల్లటి రంగులో ఉన్న ఒక చిన్న పురుగు ప్రాణంతో కదులుతూ కనిపించింది. ఆహారంలో పురుగును చూసి ఒక్కసారిగా కంగుతిన్న కస్టమర్ వెంటనే తేరుకుని, ఆ దృశ్యాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.క్షణాల్లోనే ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. లగ్జరీ హోటళ్లలో పరిశుభ్రత ఇలాగేనా ఉండేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

