ఒక బీహార్ వలస కార్మికుడు తన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నెల జీతం మొత్తం ఒక విమాన టికెట్ కోసం ఖర్చు చేశాడు. "విమానంలోనే వస్తా" అన్న తన వాగ్దానాన్ని నెరవేర్చుకుని, గ్రామానికి విమానంలో చేరుకున్నాడు. తల్లి కళ్ళల్లో ఆనందం, కొడుకు తృప్తితో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.