కుక్కను చూసి చిరుత పరుగో.. పరుగు.. ఏం జరిగిందో మీరే చూడండి!
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కోళ్లను వేటాడేందుకు నివాస ప్రాంతంలోకి వచ్చిన చిరుతపులిని కుక్కలు గట్టిగా మొరుగుతూ తరమడంతో అది భయపడి కొబ్బరి చెట్టుపైకి ఎక్కింది. చెట్టుపై చిరుతను చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకునేలోపే చిరుత వారి నుంచి తప్పించుకుని సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. కుక్కలకు భయపడి చెట్టెక్కిన చిరుత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సాధారణంగా చిరుతపులిని చూస్తే కుక్కలు భయంతో పరుగులు తీస్తాయి. కానీ కర్ణాటకలో ఇందుకు రివర్స్ జరిగింది. కోళ్లను వేటాడేందుకు వచ్చి, కుక్కల అరుపులకు భయపడిపోయిన ఓ చిరుతపులి కొబ్బరి చెట్టెక్కి తలదాచుకున్న విచిత్ర సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా జ్ఞానేశ్వరి క్యాంపస్ నివాస ప్రాంతంలోకి గురువారం ఉదయం ఒక చిరుతపులి ప్రవేశించింది. ఆహారం కోసం వెతుకుతూ అక్కడ ఉన్న కోళ్లను తినేందుకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న కొన్ని కుక్కలు చిరుతను గమనించి ఒక్కసారిగా గట్టిగా మొరగడం మొదలుపెట్టాయి. ఆ కుక్కల అరుపులకు బెదిరిపోయిన చిరుత.. బ్రతుకు జీవుడా అంటూ పరుగులు తీసింది. అయినా కుక్కలు వదలకుండా తరుముకురావడంతో సమీపంలోని ఒక ఎత్తైన కొబ్బరి చెట్టుపైకి చకచకా ఎక్కేసింది. చెట్టు కిందకి వచ్చి కుక్కలు విరామం లేకుండా మొరుగుతుండటంతో స్థానికులు ఏమిటా అని వచ్చి చూశారు. చెట్టుపై చిరుతపులి కూర్చుని ఉండటం చూసి స్థానికులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే తేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అయితే సిబ్బందికి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకున్న ఆ చిరుత, సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కుక్కలకు భయపడి చెట్టెక్కిన ఈ చిరుత ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోతుల బెడదకు చెక్.. బామ్మగారి ఐడియా అదిరిందిగా!
అత్తారింటికి దారేది? అయ్యో.. ఈ నవ వధువుకి ఎంత కష్టం వచ్చింది!
పెట్రోలును మంచినీళ్లలా తాగేసిన యువకుడు!
కుక్కను చూసి చిరుత పరుగో.. పరుగు.. ఏం జరిగిందో మీరే చూడండి!
కోతుల బెడదకు చెక్.. బామ్మగారి ఐడియా అదిరిందిగా!
అత్తారింటికి దారేది? అయ్యో.. ఈ నవ వధువుకి ఎంత కష్టం వచ్చింది!
పెట్రోలును మంచినీళ్లలా తాగేసిన యువకుడు!
కేవలం 7 రూపాయలు.. ఆమె జీవితాన్నే మార్చేశాయి!
కార్లు, బస్సులే కాదు ఇకపై రైళ్లు కూడా ఆన్‌లైన్‌లో అద్దెకు!
రూపాయి కాయిన్స్‌తో మహిళ నామినేషన్.. ఊరంతా తలో రూపాయి చందా

