AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్రోలును మంచినీళ్లలా తాగేసిన యువకుడు!

పెట్రోలును మంచినీళ్లలా తాగేసిన యువకుడు!

Phani CH
|

Updated on: Oct 26, 2026 | 1:40 PM

Share

సోషల్‌ మీడియాలో వైరల్‌ కావాలనే ఉద్దేశంతో ఓ యువకుడు పెట్రోల్‌ బంకు వద్ద పెట్రోల్‌ తాగుతున్నట్లు కనిపించిన వీడియో కలకలం రేపుతోంది. బంకు సిబ్బంది అతని చేతుల్లో పెట్రోల్‌ పోస్తుండగా, అతను తాగుతున్నట్లు వీడియోలో కనిపించింది. అయితే నిజంగా పెట్రోల్‌ మింగాడా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. ఘటన ఎక్కడ జరిగిందో కూడా నిర్ధారణ కాలేదు. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు ప్రాణాలకే ముప్పు తెస్తాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్ల కోసం కొందరు యువకులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ తాగుతున్నట్లు ఉన్న ఒక వీడియో ఇంటర్నెట్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. సోషల్ మీడియా మోజులో యువత ఎలా హద్దులు మీరుతోందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. వైరల్ అయిన ఆ వీడియోలో ఓ వ్యక్తి పెట్రోల్ బంకు వద్దకు వెళ్లాడు. అక్కడ పెట్రోల్‌ కొట్టే వ్యక్తి దగ్గరకు వెళ్లి అతన్ని తన దోసిలిలో పెట్రోలు పోయమని వంగి దోసిలి పట్టాడు. బంకు సిబ్బంది పెట్రోలు పంప్‌తో అతని చేతుల్లో పెట్రోలు పోస్తుంటే మంచినీళ్లు తాగుతున్నట్లు అతను తాగుతూ కనిపించాడు. అయితే అతను నిజంగా పెట్రోల్ మింగాడా లేదా కేవలం నటిస్తూ తర్వాత ఉమ్మేశాడా అనేది వీడియోలో స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే దానిపై కూడా కచ్చితమైన సమాచారం లేనప్పటికీ, కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ కావాలనే ఉద్దేశంతోనే అతను ఈ వికృత చేష్టకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే లక్షలాదిమంది వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం చాలా అవివేకమని మండిపడుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఇవి సమాజంలోని ఇతర యువతపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం ఇటు ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెట్టడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన కళ్లకు కడుతోంది. నిజానికి పెట్రోల్ అనేది అత్యంత విషపూరితమైన రసాయనం. దానిని పొరపాటున కూడా తాగితే మానవ శరీరంలోని జీర్ణవ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థతో పాటు నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. కొన్నిసార్లు ఇది ప్రాణాలకే ముప్పు తెస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే తాత్కాలిక గుర్తింపు కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని హితవు పంపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కేవలం 7 రూపాయలు.. ఆమె జీవితాన్నే మార్చేశాయి!

కార్లు, బస్సులే కాదు ఇకపై రైళ్లు కూడా ఆన్‌లైన్‌లో అద్దెకు!

ఒకసారి వెలిగించిన ప్రమిదను.. మళ్లీ పూజకు వాడొచ్చా?

Follow Us