అత్తారింటికి దారేది? అయ్యో.. ఈ నవ వధువుకి ఎంత కష్టం వచ్చింది!
ఉత్తరాఖండ్‌లోని చక్రాటా ప్రాంతానికి చెందిన నవవధువు షర్మిల అత్తవారింటికి చేరుకునేందుకు 18 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించినట్లు కథనం చెబుతోంది. లోఖండి నుంచి ఉండవా గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో పెళ్లి దుస్తుల్లోనే కొండదారిలో నడవాల్సి వచ్చింది. తన గ్రామానికి రోడ్డు నిర్మించాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని వీడియో ద్వారా కోరారు. ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల కొరతపై మరోసారి చర్చకు దారితీసింది.
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మారుమూల గ్రామాలకు ఇప్పటికీ కనీస రోడ్డు సౌకర్యాలు లేకపోవడం శోచనీయం. ఉత్తరాఖండ్‌లోని చక్రాటా ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. అత్తారింటికి వెళ్లేందుకు సరైన దారి లేక ఒక నవవధువు ఏకంగా 18 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి వార్తల్లో నిలిచింది. డెహ్రాడూన్ సమీపంలోని బులహర్ గ్రామానికి చెందిన షర్మిలకు, ఉండవా అనే మారుమూల గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది. పెళ్లి వేడుక అనంతరం అత్తవారింటికి ప్రయాణమైన ఆమె వాహనం లోఖండి ప్రాంతం వద్ద ఆగిపోయింది. అక్కడి నుంచి ఉండవా గ్రామానికి అసలు రోడ్డు మార్గమే లేకపోవడంతో వేరే దారి లేక ప్రయాణాన్ని కాలినడకనే కొనసాగించాల్సి వచ్చింది. బరువైన పెళ్లి లెహంగా ధరించి, రాళ్లు రప్పలతో కూడిన కొండ దారిలో ఆమె కిలోమీటర్ల కొద్దీ వేగంగా నడుస్తున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. ఈ ప్రయాణంలోనే ఆమె తన ఆవేదనను ఒక వీడియో ద్వారా నేరుగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దృష్టికి తీసుకెళ్లింది. “నేను లోఖండి నుంచి ఉండవా గ్రామానికి నడిచి వెళ్తున్నాను.. భవిష్యత్తులో మరెవరికీ ఇలాంటి కష్టాలు రాకుండా దయచేసి మా ఊరికి రోడ్డు వేయించండి” అని ఆమె వేడుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రహదారులు లేకపోవడం వల్ల అత్యవసర సమయాల్లో గర్భిణులు, రోగులు, వృద్ధులు ఆసుపత్రులకు వెళ్లలేక ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెట్రోలును మంచినీళ్లలా తాగేసిన యువకుడు!
కేవలం 7 రూపాయలు.. ఆమె జీవితాన్నే మార్చేశాయి!
అత్తారింటికి దారేది? అయ్యో.. ఈ నవ వధువుకి ఎంత కష్టం వచ్చింది!
పెట్రోలును మంచినీళ్లలా తాగేసిన యువకుడు!
కేవలం 7 రూపాయలు.. ఆమె జీవితాన్నే మార్చేశాయి!
కార్లు, బస్సులే కాదు ఇకపై రైళ్లు కూడా ఆన్లైన్లో అద్దెకు!
రూపాయి కాయిన్స్‌తో మహిళ నామినేషన్.. ఊరంతా తలో రూపాయి చందా
దిండుకింద చేయి పెట్టిన యువతి.. చేతికి తగిలింది చూసి షాక్!
ఇంటిముందు బెంచ్‌పై కూర్చున్న వ్యక్తులు క్షణాల్లో ఊహించని సీన్

