దేవుడు/దేవత లేని గుడి

×

దేవుడు/దేవత లేని గుడి

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ధర్మాబాద్ గ్రామంలో ఒక వింత ఆలయం ఉంది. ఈ గుడికి గోపురం ఉంది, అద్భుతమైన శిల్పకళ ఉంది, కానీ గుడిలో దైవం లేదు. అసలు దేవుడు లేకుండా గుడి ఎందుకు కట్టారు అనే ప్రశ్న తలెత్తుతుంది. స్థానికుల కథనం ప్రకారం, లక్ష్మీకాంతరావు అనే సంస్థానాధీశుడు ఈ గుడిని నిర్మించారు. ఆయన ఆండాళ్ అమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావించారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ఇంజనీర్లను పిలిపించి పక్కనే ఉన్న రంగనాయకస్వామి ఆలయం నుంచి రోప్ వే నిర్మించాలని కూడా ప్రణాళిక వేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నం ఆగిపోయింది. విగ్రహ ప్రతిష్ట జరగలేదు. లక్ష్మీకాంతరావు తర్వాత ఆయన వారసులు కూడా ఈ గుడిని పెద్దగా పట్టించుకోలేదు. వందల ఏళ్లుగా ఈ ఆలయం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. దీని గోపురం పైన పెళ్లిళ్లు, పట్టాభిషేకాల వంటి ముఖ్య ఘట్టాలకు సంబంధించిన దృశ్యాలు అందంగా చెక్కబడి ఉన్నాయి. మంచి మండపం, అద్భుతమైన స్వాగత తోరణం కూడా ఉన్నాయి. ఇప్పుడు స్థానికులు అందరూ కలిసి ఈ నిరుపయోగంగా పడి ఉన్న ఆలయాన్ని ఒక అందమైన పార్కుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఇది ఫోటో షూట్‌లకు, సాయంత్రం సేద తీరడానికి ఉపయోగపడుతోంది.

Phani CH