AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రణబాలి

రణబాలి

విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 19వ శతాబ్దంలో (1854-1878) జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, బ్రిటిష్ అణచివేత ,‘గ్రేట్ ఫామైన్’ (కరువు) నేపథ్యంతో ఈ కథ రూపొందింది. ఇందులో విజయ్ దేవరకొండ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే ‘రణబాలి’ అనే పవర్‌ఫుల్ వీరుడి పాత్రలో కనిపిస్తుండగా, రష్మిక ‘జయమ్మ’ అనే భావోద్వేగమైన పాత్రను పోషిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ లోని హింస, రక్తపాతం , విజయ్ రస్టిక్ లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్-రష్మిక కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రష్మిక ‘జయమ్మ’ అనే ఒక పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తోంది.

ఇంకా చదవండి

Ranabaali Movie: చరిత్ర చెప్పని కథకు ప్రాణం పోశారు.. రణబాలి ట్రైలర్ పై నారా లోకేష్ ప్రశంసలు..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 16న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ మూవీపై అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ మాత్రం సినిమాపై హైప్ పెంచేసింది.

రణబాలి కథ రివీల్ చేసిన దర్శకుడు!

రణబాలి సినిమాపై నెలకొన్న ఊహాగానాలకు దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరదించారు. ఇది బయోపిక్ కాదని స్పష్టం చేస్తూ, రాయలసీమ యోధుల స్ఫూర్తితో రూపొందించిన కల్పిత పాత్ర అని తెలిపారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ చిత్రం, అనేక చారిత్రక వీరుల లక్షణాలతో తీర్చిదిద్దబడింది.

Vijay Deverakonda Rashmika: సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా.. కానీ మా అమ్మ.. విజయ్ దేవరకొండ..

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిరంతరం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి హిట్ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట ఇప్పుడు మరోసారి రణబాలి సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Ranabaali Movie: రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది.. మనం మర్చిపోయిన కథతో..

టాలీవుడ్ డైరెక్టర్ రాహుల్‌ సాంకృత్యాయన్ దర్శకత్వంలో హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు ఎట్టకేలకు అక్టోబర్‌ 16 విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, అలాగే ఏందయ్యా సామీ ఫుల్‌ సాంగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Ranabaali : ఏముందీ భయ్య ఈ సాంగ్.. రణబాలి నుంచి అందమైన మెలోడీ రిలీజ్.. వింటూ ఉండిపోవాల్సిందే..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ రణబాలి. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన మెలోడీ సాంగ్ ఆక్టటుకుంటుంది. ముఖ్యంగా ఇందులో విజయ్, రష్మిక లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.

గ్లామర్‌ సీక్రెట్ రివీల్ చేసిన రష్మిక

రష్మిక మందన్న టాలీవుడ్ అరంగేట్రం నుండి విజయ్ దేవరకొండతో వివాహం, రణబాలిలో నటన, అలాగే మైసాలో అండర్ వాటర్ యాక్షన్ సీన్ల వరకు తన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఆమె తన గ్లామర్ రహస్యాన్ని కూడా వెల్లడించారు. గోరువెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, జుట్టుకు వాడటమే తన అమ్మమ్మ, అమ్మ నేర్పిన చిట్కా అని తెలిపారు.