AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranabaali: రణబాలి దూకుడు.. బాక్సాఫీస్‌పై విజయ్ దండయాత్ర

Ranabaali: రణబాలి దూకుడు.. బాక్సాఫీస్‌పై విజయ్ దండయాత్ర

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 21, 2026 | 5:34 PM

Share

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ బాక్సాఫీస్‌ వద్ద దూకుడు కొనసాగిస్తున్నట్లు ట్రేడ్‌ వర్గాల సమాచారం. విడుదలైన ఐదో రోజైన సోమవారం కూడా సినిమా టికెట్ల బుకింగ్స్‌ బలంగా ఉన్నాయని, గంటకు 12 వేలకు పైగా టికెట్లు బుక్‌ అవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం, విజయ్‌ నటన, రష్మిక అభినయం సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పెంచుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

రణబాలి సినిమా దూకుడు బాక్సాఫీస్ దగ్గర అస్సలు తగ్గట్లేదు.. మండే టెస్ట్ కూడా పాస్ అయ్యి ఐదో రోజు కూడా గంటకు వేలల్లో టికెట్స్ బుక్ అవుతున్నాయి. రాహుల్ టేకింగ్‌కు రౌడీ బాయ్ విజయ్, రష్మికల ఆన్ స్క్రీన్ మ్యాజిక్ తోడవ్వడంతో ఈ విజయదశమి కాస్తా విజయ్ దశమిగా మారింది. ఈ భారీ విజయం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో చూద్దామా..? రణబాలి దూకుడు ఏమాత్రం తగ్గకుండా మండే టెస్ట్‌ కూడా సక్సెస్‌ఫుల్‌గా పాస్ అయి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంది. రిలీజైన ఐదో రోజు కూడా గంటకు 12 వేలకు పైగా టికెట్స్ బుక్ అవుతుండటం చూస్తుంటే.. దసరా సంబరాలను ఈ సినిమా ఏ రేంజ్‌లో తన ఖాతాలో వేసుకుంటుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దర్శకుడు రాహుల్ సాంక్రీత్యన్ మూడేళ్ల కష్టం, విజయ్ పడిన రెండేళ్ల శ్రమతో పాటు రష్మిక అద్భుతమైన అభినయం ఈ సినిమాను ఇంతటి భారీ విజయం వైపుగా నడిపిస్తున్నాయి. కంటెంట్ ఉన్న మంచి కథతో వస్తే మన ఆడియన్స్ ఏ విధంగా ఓన్ చేసుకుంటారో చెప్పడానికి రణబాలి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దసరా సీజన్ పూర్తయ్యే వరకు బాక్సాఫీస్ దగ్గర రణబాలి కలెక్షన్ల హవా ఏమాత్రం తగ్గదని కలెక్షన్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. చాలా కాలంగా ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ.. ఈ అద్భుతమైన సక్సెస్‌తో బాక్సాఫీస్ దగ్గర మళ్లీ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చేసి తన ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yash: తప్పులు కాదు.. సినిమాలు చూడమంటున్న రావణుడు

దేవరగట్టు..తలలు పగిలినా తగ్గేదే లే..ఈ రణరంగం వెనుక చరిత్ర ఇదే

Gold Prices Update: స్థిరంగా బంగారం ధర..తగ్గిన వెండి ధర

పాలపిట్టను చూసేదెలా.. దాన్ని పట్టుకుంటే జైలుకే

తగ్గిపోతున్న చందమామ సైజు.. భూమికి ప్రమాదం పొంచి ఉందా!

Follow Us