Yash: తప్పులు కాదు.. సినిమాలు చూడమంటున్న రావణుడు
‘రామాయణ’ విజువల్ ఎఫెక్ట్స్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో నటుడు యశ్ స్పందించినట్లు కథనం చెబుతోంది. హైదరాబాద్‌లో జరిగిన తెలుగు ప్రీ రిలీజ్ కార్యక్రమంలో చిన్నచిన్న లోపాలను పక్కనపెట్టి సినిమాను ఓపెన్ మైండ్‌తో చూడాలని ప్రేక్షకులను కోరినట్లు సమాచారం. నమిత్ మల్హోత్రా వంటి నిర్మాతలను ప్రోత్సహిస్తేనే భారతీయ సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని యశ్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇందులో రణ్‌బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు.
ఈ రోజుల్లో విజువల్ బేస్డ్ సినిమా విడుదలైతే చాలు.. అదెలా ఉంది అనేదాని కంటే ముందు అందులో ఏం లోపాలున్నాయని వెతకడం కామన్ అయిపోయింది. సినిమా ఎంత పెద్దదైనా.. గ్రాఫిక్స్ దగ్గరే దొరికిపోతున్నారు. దీని గురించే ఓపెన్ అయ్యారు యశ్. రామాయణ విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ యశ్ ఏమన్నారో తెలుసా..?హైదరాబాద్‌లో జరిగిన రామాయణ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రావణుడిగా నటించిన యశ్ సినిమాపై వస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. VFX విషయంలో చిన్న చిన్న తప్పులు వెతకడం మానేసి.. సినిమాను ఓపెన్ మైండ్‌తో చూడాలని ఆడియన్స్‌ను రిక్వెస్ట్ చేశారు. నమిత్ మల్హోత్రా లాంటి ప్యాషన్ ఉన్న నిర్మాతలను సపోర్ట్ చేయకపోతే ఇండియన్ సినిమా ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్తుందన్నారాయన. రామాయణ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి బడ్జెట్‌కు తగ్గ క్వాలిటీ లేదంటూ విమర్శలు వచ్చాయి. ఈ మధ్యే వచ్చిన కొత్త ట్రైలర్‌కు మాత్రం మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కొందరింకా విజువల్స్‌పై కామెంట్స్ చేస్తుండటంతో.. మైనర్ మిస్టేక్స్ వదిలేసి అంతా ఒకటై సినిమాను సపోర్ట్ చేయాలని యశ్ పిలుపునిచ్చారు. అప్పుడే ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఇండియన్ సినసిమా సత్తా చాటుతుందన్నారు. నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రామాయణ పార్ట్ 1 నవంబర్ 5న విడుదల కానుంది. ఇందులో రణ్‌బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతమ్మగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే ఇలాంటి సినిమాను విమర్శలతో నిరుత్సాహపరచకూడదన్నారు యశ్. మరి రాకింగ్ స్టార్ కామెంట్స్ సినిమాకు ఏ మేర హెల్ప్ అవుతాయో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవరగట్టు..తలలు పగిలినా తగ్గేదే లే..ఈ రణరంగం వెనుక చరిత్ర ఇదే
Gold Prices Update: స్థిరంగా బంగారం ధర..తగ్గిన వెండి ధర
పాలపిట్టను చూసేదెలా.. దాన్ని పట్టుకుంటే జైలుకే
పాలపిట్టను చూసేదెలా.. దాన్ని పట్టుకుంటే జైలుకే
పుట్టగానే పుష్ప అంటున్న బుడ్డోడు! చిన్నారి వీడియో వైరల్
వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!
డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..
అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..
సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు
గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

