AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranabaali: విజయ్‌ దేవరకొండ శివ తాండవం.. రణబాలి నుంచి ‘కోబలి’ ఫుల్ వీడియో సాంగ్‌ రిలీజ్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన లేటెస్ట్ సినిమా 'రణబాలి'. దసరా కానుకగా రిలీజైన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను అధిగమించిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

Ranabaali: విజయ్‌ దేవరకొండ శివ తాండవం.. రణబాలి నుంచి ‘కోబలి’ ఫుల్ వీడియో సాంగ్‌ రిలీజ్
Ranabaali Movie
Basha Shek
|

Updated on: Oct 27, 2026 | 7:42 PM

Share

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ సినిమా రణబాలి. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి వసూళ్లను రాబడుతోంది. కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ విజయ్ దేవరకొండ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఓవర్సీస్ లోనూ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. 1878 కాలంలో రాయలసీమలో సంభవించిన కరువు, ప్రజల కష్టాలు, బ్రిటిష్ పాలకుల ఆగడాలను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. హాలీవుడ్ స్టార్ నటుడు అర్నాల్డ్ వాస్లూ ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటించాడు. ప్రస్తుతం రణబాలి సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ‘కోబలి’ అనే పవర్‌ఫుల్ ఎలివేషన్ సాంగ్‌ వీడియోను టీమ్‌ విడుదల చేసింది. ఈ పాటలో విజయ్ దేవరకొండ ఒంటినిండా భస్మం, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి, చేతిలో కత్తి-త్రిశూలంతో చేసిన తాండవం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా థియేటర్లలో ఈ సాంగ్ కు విజిల్స్ పడ్డాయి. విజయ్ బాడీ లాంగ్వేజ్, హావభావాలు కూడా ఈ పాటను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రణబాలి సినిమాను నిర్మించారు. అజయ్–అతుల్ ఈ సినిమాకు సంగీతం అందించగా పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ‘ఏందయ్యా సామీ’ పాట అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ లో ఈ పాటకు రికార్డు వ్యూస్ వస్తున్నాయి. ఇటీవలే ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు కోబలి ఫుల్ వీడియో సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.

రణబాలి ‘కోబలి’ సాంగ్ ఫుల్ వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
 దీపావళికి ముందు ఇంట్లో ఈ పనులు చేసేయండి.. 
 దీపావళికి ముందు ఇంట్లో ఈ పనులు చేసేయండి.. 
విజయ్ దేవరకొండ రణబాలి ‘కోబలి’ ఫుల్ వీడియో సాంగ్‌ వచ్చేసింది
విజయ్ దేవరకొండ రణబాలి ‘కోబలి’ ఫుల్ వీడియో సాంగ్‌ వచ్చేసింది
బెల్లం స్వీట్ తినొచ్చా? షుగర్ ఉన్నవారు దీపావళికి ఏం తినాలంటే?
బెల్లం స్వీట్ తినొచ్చా? షుగర్ ఉన్నవారు దీపావళికి ఏం తినాలంటే?
రవి నక్షత్ర సంచారం.. మరో వారం రోజులు ఈ 3 రాశుల వారికి అదృష్టం!
రవి నక్షత్ర సంచారం.. మరో వారం రోజులు ఈ 3 రాశుల వారికి అదృష్టం!
వెండి ధరలు భారీగా పతనం.. రూ.2లక్షల దిగువకు..!
వెండి ధరలు భారీగా పతనం.. రూ.2లక్షల దిగువకు..!
మంచం, పరుపుల చివర్లో నల్లులు ఉన్నాయా?.. ఇలా చేస్తేనే అవి పోతాయ్ 
మంచం, పరుపుల చివర్లో నల్లులు ఉన్నాయా?.. ఇలా చేస్తేనే అవి పోతాయ్ 
కలెక్టర్‌ అని తెలియక బాధలన్నీ చెప్పుకుంది.. ఇంటికెళ్లేసరికి షాక్!
కలెక్టర్‌ అని తెలియక బాధలన్నీ చెప్పుకుంది.. ఇంటికెళ్లేసరికి షాక్!
రోడ్డే సరిహద్దు.. పాలనలో గందరగోళం!స్థానిక ఎన్నికల వేళ గుంటూరు జిల
రోడ్డే సరిహద్దు.. పాలనలో గందరగోళం!స్థానిక ఎన్నికల వేళ గుంటూరు జిల
కావ్య-అనిరుధ్‌ పెళ్లి రిసెప్షన్‌.. టాలీవుడ్ నుంచి ఆ హీరో ఒక్కరే!
కావ్య-అనిరుధ్‌ పెళ్లి రిసెప్షన్‌.. టాలీవుడ్ నుంచి ఆ హీరో ఒక్కరే!
మనిషివా.. రోబోవా.. అభిషేక్ క్యాచ్ కోసం గాల్లోకి అలా
మనిషివా.. రోబోవా.. అభిషేక్ క్యాచ్ కోసం గాల్లోకి అలా