AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. 1989 మే 9న హైదరాబాద్‏లో జన్మించిన విజయ్… 2011లో నువ్విలా సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశారు. తొలినాళ్లలో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. 2016లో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారారు. ఈ మూవీకి మంచి విజయం సాధించింది. ఆ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ విజయ్ కెరీర్‏ను మలుపుతిప్పింది. అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులు అతడిని ‘రౌడీ’ హీరో అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. మహానటి, ఈ నగరానికి ఏమైంది, టాక్సీవాలా చిత్రాల్లో నటించారు విజయ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్… ఇప్పుడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. రొమాంటిక్, కామెడీ, మాస్ యాక్షన్ ఇలా అన్ని రకాల ఎంటర్టైనర్స్‏తో మెప్పిస్తున్నాడు విజయ్.

ఇంకా చదవండి

Rashmika Mandanna : ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండతో పెళ్లి.. స్పందించిన రష్మిక మందన్న..

ఇప్పుడు వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా. తెలుగు, హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె.. మరోవైపు పెళ్లి వార్తలతో నిత్యం వార్లలో నిలుస్తుంది. ఇటీవలే విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగిందంటూ ప్రచారం నడిచింది. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ పై రష్మిక రియాక్ట్ అయ్యింది.

Vijay Deverakonda: ఇదేందీ మావ..! విజయ్ దేవరకొండ, తమన్నా కలిసి నటించారా..!!

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఊహించని స్టార్ డమ్ ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ‘గీత గోవిందం’ తో వంద కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయాడు. ట్యాక్సీవాలా, డియర్ కామ్రేడ్ సినిమాలతో యూత్ ఐకాన్ గా మారిపోయాడు .

Vijay Deverakonda: అదిరిందయ్యా రాహుల్! విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్!

గతంలో విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రను పోషించాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం మరో హాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపుతున్నాడు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్.

పెళ్లికి వేళయింది..! రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం ఎప్పుడు , ఎక్కడంటే..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. థామా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల రష్మిక పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. కొన్ని రోజుల క్రితం ఆమె విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకుందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది.

Rashmika Mandanna: ప్రతి ఒక్కరి లైఫ్‌లో విజయ్ దేవరకొండ ఉండటం బ్లెస్సింగ్: రష్మిక మందన్నా

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న సందదర్భంగా బుధవారం (నవంబర్ 11) సక్సెస్ మీట్ నిర్వహించారు.

నన్ను చూసి నువ్వు గర్వపడతావ్ విజయ్.. రష్మిక ఆసక్తికర పోస్ట్

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా జోడీ మరో సారి ట్రెండ్ అవుతోంది. నెట్టింట వీరి పెళ్లి వార్తలు మళ్లీ గుప్పమంటున్నాయి. ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ అయినట్లు వార్చలొచ్చాయి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.

Vijay Devarakonda- Rashmika: విజయ్-రష్మికల పెళ్లి ముహూర్తం ఫిక్స్! డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాలు పెళ్లిపీటలెక్కనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీళ్లు నిశ్చితార్థం చేసుకున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఈ ప్రేమ పక్షుల పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండతో స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ.. 51 ఏళ్ల వయసులో సీనియర్ హీరోయిన్ కామెంట్స్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన విజయ్.. ఇప్పుడు తన కొత్త సినిమా రౌడీ జనార్దన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా.. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తాజాగా విజయ్ గురించి ఓ సీనియర్ హీరోయిన్ చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి.

Vijay Deverakonda- Rashmika: మొన్న విజయ్.. నేడు రష్మిక.. ఎంగేజ్మెంట్‌ రింగ్స్‌తో లవ్ బర్డ్స్.. వీడియో ఇదిగో

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు త్వరలో పెళ్లిపీటలెక్కనున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 03న వీరి ఎంగేజ్మెంట్ కూడా పూర్తయ్యిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు విజయ్- రష్మిక.

Vijay Deverakonda-Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. ఇద్దరి ఆస్తులు ఎంత ఉంటాయో తెలుసా.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలోనే మరో సెలబ్రెటీ జంట పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరోహీరోయిన్లుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్, రష్మిక కొన్ని రోజుల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.