AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Rashmika Marriage : గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం.. చూడముచ్చటగా పెళ్లి ఫోటోస్..

ఎప్పటినుంచో అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్, రష్మిక పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. గురువారం ఈ ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం వీరిద్దరి పెళ్లి జరిగింది. సాయంత్రం కొడవ సంప్రదాయం ప్రకారం మరో సారి పెళ్లి వేడుక జరిగింది. తాజాగా తమ పెళ్లి ఫోటోస్ షేర్ చేస్తూ తన భర్తను పరిచయం చేసింది రష్మిక మందన్నా.

Rajitha Chanti
|

Updated on: Feb 26, 2026 | 10:09 PM

Share
 గీతా గోవిందం ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో రష్మిక, విజయ్ ఏడడుగులు వేశారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. మార్చి 4న వీరి వివాహ రిసెప్షన్ హైదరాబాద్ లో జరగనున్న సంగతి తెలిసిందే.

1 / 5
గీత గోవిందం సినిమాతో మొదలైన ఇద్దరి ప్రేమ ప్రయాణం ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యింది. అల్లరితో మొదలైన సినీప్రయాణం ఒకరి కోసం ఒకరు నిలబడేలా చేసింది. ఇన్నాళ్లు నేషనల్ క్రష్ గా ఉన్న రష్మిక ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇంటి మహాలక్ష్మిగా మారింది. రియల్ లైఫ్ మ్యారేజీతో ఒక్కటయ్యారు విజయ్, రష్మిక.

2 / 5
అటు వెండితెరపై వీరిద్దరి జోడికి అభిమానులు ఫిదా అయ్యారు. అలా మొదలైన వీరి పరిచయం డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేమగా మారింది. ఇప్పటికే చాలా కాలం వీరిద్దరి ప్రేమ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు వీరు అధికారికంగా తమ బంధాన్ని ప్రకటించారు.

3 / 5
ప్రస్తుతం విజయ్, రష్మిక పెళ్లి ఫోటోస్ వైరలవుతున్నాయి. అయితే అంతకు ముందు వీరిద్దరు ఇన్ స్టా వేదికగా తమ ప్రేమ విషయాన్ని పరోక్షంగా వెల్లడిస్తూనే ఉన్నారు. పలు సందర్బాల్లో ఒకరిపై ఒకరికి ఉన్న అభిప్రాయాలను పంచుకుని అభిమానుల్లో జోష్ నింపారు.

4 / 5
ఇక ఎట్టకేలకు తమ బంధం పేరు అభిమానులు పిలుచుకుంటున్న విరోష్ అంటూ అధికారికంగా ఫిబ్రవరి 22న వెల్లడించారు. ఫిబ్రవరి 26న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ రష్మిక పెళ్లి వేడుక విరోష్ పేరు మారుమోగుతుంది.

5 / 5
Follow Us