గ్యాస్ సిలిండర్ పేలుడు.. 13 మంది చిన్నారులు సహా 23 మందికి తీవ్ర గాయాలు.. పలువురికి సీరియస్!
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో 13 మంది చిన్నారులతో సహా మొత్తం 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు పలువురి శరీరాలు కాలిపోవడంతో వారిని మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో 13 మంది చిన్నారులతో సహా మొత్తం 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు పలువురి శరీరాలు కాలిపోవడంతో వారిని మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
19 మందికి ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలింపు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 19 మందిని మెరుగైన వైద్యం కోసం అంబులెన్సుల్లో ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. ఒరై మెడికల్ కాలేజీలో ప్రత్యేక బర్న్ వార్డు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరో నలుగురికి ఒరై జిల్లా ఆసుపత్రిలోని బర్న్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
పేలుడు ధాటికి ఇళ్లకు నష్టం?
సిలిండర్ పేలుడు తీవ్రతకు సమీపంలోని ఇళ్లకు కూడా నష్టం జరిగినట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. పేలుడు ధాటికి ఓ ఇంటి ప్రధాన గేటు ఊడిపడటంతో పాటు చుట్టుపక్కల ఇళ్ల గోడలు దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే ఈ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
ఆసుపత్రికి చేరుకున్న ఎస్పీ.. దర్యాప్తు ప్రారంభం
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పరిపాలనా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీస్ సూపరింటెండెంట్ సురేష్ చంద్ర రావత్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున సాధ్యమైనంత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు సిలిండర్‌కు మంటలు ఎలా అంటుకున్నాయి? గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
