ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో.. హిట్ కోసం శ్రీలీల వైటింగ్
22 November 2026
Rajeev Rayala
నటి శ్రీలీల తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది.
కెరీర్ ప్రారంభం నుంచే శ్రీలీలకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్‌లు కూడా దక్కించుకుంది.
రవితేజ సరసన నటించిన ధమాకా సినిమా శ్రీలీలకు మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ధమాకా తర్వాత శ్రీలీల నటించే ప్రతి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దీంతో ఆమె తదుపరి సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తూ శ్రీలీల ఫుల్ బిజీగా మారిపోయింది. టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటోంది.
వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి.
మహేష్ బాబు సరసన గుంటూరు కారం, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించిన శ్రీలీలకు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ, సినిమాల ఫలితం మాత్రం మిశ్రమ స్పందనను అందుకుంది.