బ్యాక్ టు బ్యాక్ సినిమాలు.. కానీ నో హిట్స్ 

22 November 2026

Rajeev Rayala 

టాలీవుడ్‌లో ఒకప్పుడు యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరు.

ముఖ్యంగా కుమారి 21F సినిమాతో ఈ అమ్మడికి భారీ గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసింది.

అయితే ప్రారంభంలో వచ్చిన క్రేజ్‌ను తర్వాతి సినిమాలతో కొనసాగించడంలో హెబ్బా పటేల్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా ప్రభావం చూపించే విజయాలు అందుకోలేకపోయింది.

కమర్షియల్ సినిమాలతో పాటు విభిన్నమైన కథలను కూడా ఎంచుకుంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

గ్లామర్ పరంగా, నటన పరంగా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ సరైన కథలు, బలమైన పాత్రలు దక్కకపోవడం కూడా ఆమె కెరీర్‌పై ప్రభావం చూపిస్తోంది.